Pawan Kalyan: ఏపీ ఎలక్షన్స్ కు రంగం సిద్ధమైంది. ఎవరి ప్రచార వ్యూహాలను వారు సంధిస్తున్నారు. ఇక ఈసారి జనసేన- టీడీపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. తాజాగా నేడు తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభ అయిన తెలుగు జన విజయకేతన జెండా సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్.. రెండు తెలుగు రాష్ట్రాలను హీటెక్కిస్తున్నాయి.
జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మన కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అని స్పష్టం చేశారు..
రాజకీయాల్లో శాశ్వత శతృత్వం, మిత్రత్వం ఉండదు అన్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన... ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్ట్రానికి మేలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.. ఇక, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని తెలిపారు