Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కాకినాడ పర్యటన పొడిగించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.. కాకినాడ సిటీ నియోజక వర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జనసేనాని.. తన పర్యటనలో భాగంగా కాకినాడ సిటీపైనే ఎక్కువగా దృష్టి సారించారు. నియోజకవర్గాల సమీక్ష చేపట్టిన ఆయన కాకినాడ సిటీపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.. అంతేకాదు.. 50 డివిజన్ల నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. డివిజన్ స్థాయిలో సైతం నేతల పనితీరుపై ఆయన ఆరా తీశారు.. కొన్ని ప్రాంతాల్లో కమిటీలు వేయకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.. ఇక, ఈ రోజు కాకినాడ సిటీపైనే సమీక్ష చేశారు..
Read Also: Naga Shaurya: పెళ్ళై ఏడాది కాకముందే నాగశౌర్య వేరు కాపురం.. షాకింగ్ విషయాలు చెప్పిన తల్లి
అయితే, కాకినాడలో పవన్ కల్యాణ్ పర్యటన మరొక రోజు పొడిగించారు.. కాకినాడ సిటీ నియోజకవర్గం పై ప్రత్యేక పోకస్ పెట్టిన జనసేనాని.. మొత్తం 50 డివిజన్‌లు, వార్డులు వారీగా రివ్యూ చేస్తున్నారు.. ఇప్పటి వరకు 15 డివిజన్‌లకు సంబంధించిన జనసైనికులతో సమీక్షా సమావేశాలు పూర్తి చేశారు.. మిగతా డివిజన్లపై కూడా పూర్తిస్థాయిలో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.. దీనికి ప్రత్యేక కారణం ఉంది.. వారాహి యాత్రలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డినిని ఓడించి తీరుతానని సవాల్ చేశారు పవన్ కల్యాణ్.. అయితే, దీనిపై స్పందించిన ద్వారంపూడి.. దమ్ముంటే పవన్ కల్యాణ్ తనపై పోటీ చేయాలని ప్రతి సవాలు విసిరారు.. దీంతో పవన్ కాకినాడపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.. అంతేకాకుండా.. కాకినాడ నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయాలని, దాని ప్రభావం జిల్లాపై ఉంటుందని స్థానిక నేతలు కోరుతున్నారు.. ఇక, షెడ్యూల్ ప్రకారం రేపటితో పవన్ కల్యాణ్ కాకినాడ టూర్ ముగియనుంది. అంటే.. 28, 29, 30 తేదీల్లో కాకినాడలో పర్యటించాలని పవన్ నిర్ణయించారు.. ఇప్పుడు మరొకరోజు పొడిగించడంతో.. 31వ తేదీన కూడా కాకినాడలో పవన్ సమీక్షలు కొనసాగనున్నట్టు తెలుస్తోంది.
Read Also: Perni Nani: వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వలేదు..
కాగా, నేను కాకినాడలో పుట్టి ఈ స్థాయికి రావడానికి రాజకీయాల్లో కష్టపడ్డాను.. కాకినాడ నుంచి రెండుసార్లు గెలిచాను.. కానీ, పవన్ రెండు సీట్లలో పోటీ చేసి ఓడిపోయారు.. ఇవే మా ట్రాక్ రికార్డ్స్ అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి విమర్శలు గుప్పించిన విషయం విదితమే.. ఇక, పీడీఎస్ బియ్యం ఎగుమతి ద్వారా నేను, మా కుటుంబం రూ.15 వేల కోట్లు సంపాదించామని పవన్ కల్యాణ్ ఆరోపించారు. బియ్యం ఎగుమతులపై పవన్‌కు ఏమీ తెలియదని రుజువు చేసింది. నా దగ్గర అంత కోట్లు ఉంటే నేను ఈజీగా పవన్ కల్యాణ్‌ను కొనుగోలు చేసి ఆఫర్ ఇచ్చేవాడిని అని కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.