మత్తు రాజకీయంలోకి జనసేన కూడా ఎంటరైందా? ఇరికించామని టీడీపీ.. కౌంటర్ ఇచ్చామని అధికార పార్టీ అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా తెర మీదకు వచ్చారు జనసేనాని. పొలిటికల్‌గా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేశారా? లేక చంద్రబాబు మనిషిగానే పవన్ కల్యాణ్ కామెంట్స్ పాస్ చేశారా? గంజాయిపై వరసగా ట్వీట్స్ రిలీజ్ చేస్తోన్న పవన్..! ఏపీలో రాజకీయం మత్తులో జోగుతోంది. ఉదయం లేచింది మొదలు అధికార పార్టీ.. ప్రతిపక్ష టీడీపీ.. డ్రగ్స్.. హెరాయిన్.. గంజాయి అంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి.…
‘నాకొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంద’ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ మూవీలో పవర్ ఫుల్ డైలాగ్ చెబుతాడు. దీనికి ఆయన అభిమానులంతా చప్పళ్లు.. కేరింతలతో ఆదరించారు. ఈ సినిమాలో కన్పించినట్లుగానే పవర్ స్టార్ రాజకీయాల్లోనూ దూకుడుగానే వెళుతున్నారు. సినిమాల్లో బీజీగా ఉంటూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవం నుంచి గుణపాఠాలు నేర్చుకొని పార్టీని తనదైన శైలిలో ముందుకు తీసుకెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. జనసేన…
విజయవాడలోని జనసేన కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీలోని అన్ని జిల్లాల జనసేన అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఏపీ సర్కారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని.. వీటి మరమ్మతులకు తగిన గడువు ఇచ్చినా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. శ్రమదానం ద్వారా రోడ్ల మరమ్మతులను జనసేన పార్టీ చేపడితే.. ప్రభుత్వం…
ఏపీ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలంటూ ఆ ప్రాంత రైతులు ఎన్నో రోజులుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. అయినా వైసీపీ ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో నవంబర్ 1 నుంచి మహాపాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పాదయాత్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు నుంచి చిత్తూరు జిల్లాలోని తిరుమల వరకు 45 రోజుల పాటు కొనసాగనుంది. నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న రైతుల మహాపాదయాత్ర డిసెంబర్ 17వ తేదీతో ముగియనుంది. Read Also: టీడీపీ ఎంపీ కేశినేని నాని…
ఏపీలో జనసేనకు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆయన ఇటీవల వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. కానీ అధికారికంగా వైసీపీలో చేరలేదు. అలా చేరితే పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకు వస్తుంది. అప్పుడు అనర్హత వేటు పడే అవకాశముంటుంది. దీంతో ఆయన జనసేన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. Read Also: గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు.. వైసీపీపై ఫిర్యాదు ఈ నేపథ్యంలో గురువారం వైసీపీ జనాగ్రహ దీక్షలు చేపట్టగా…
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు కాస్త 15 సీట్లుగా మారే రోజు ఎంతో దూరంలో లేదని కామెంట్ చేశారు జనసేన నేతలు.. చిత్తూరు జిల్లా కుప్పంలో జనసేన జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.. సమావేశానికి ముందు భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన జన సైనికులు ఆ తర్వాత సమావేశమయ్యారు.. ఆ మీటింగ్‌కు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, జనసేన కుప్పం ఇంచార్జి డాక్టర్ వెంకటరమణ తదితరులు హాజరు కాగా.. ఈ…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి కొడాలి నాని.. కమ్మలకు అండగా ఉంటానని పవన్ కల్యాణ్ అనటం సిగ్గు లేనితనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. రాధాకృష్ణ, రామోజీరావు, నాయుడు, చంద్రబాబుకు అండగా ఉంటాను అంటున్నాడు.. కమ్మ కులం అంటే ఈ నలుగురే అనుకుంటున్నాడు పవన్ కల్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు కొడాలి నాని.. ఏ రాజకీయ నాయకుడు అయినా పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా…
తెలంగాణలో జనసైనికులతో పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. చాలా రోజుల తరువాత తెలంగాణలో కార్యకర్తలతో, నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009 లో తెలంగాణలో సంపూర్ణంగా తిరిగానని అన్నారు. తనను దెబ్బకొట్టేకొద్దీ మరింత ఎదుగుతానని తెలిపారు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ తెలిపారు. ఈ నేల తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. బలమైన సామాజిక మార్పుకోసం ప్రయత్నిస్తానని అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు…
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ గాడి తప్పింది అంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు సకాలంలో ఇవ్వకపోతే ఎలా..? అని నిలదీసిన ఆయన.. వృద్ధాప్యంలో వారి వైద్య ఖర్చులకీ ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని… రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ గాడి తప్పడమే దీనికి కారణంగా తెలిపారు పవన్ కల్యాణ్… మరోవైపు.. పోలీసుశాఖలో…