Kasibugga Temple Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించేందుకు జనసేన నుంచి ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను ఘటనా స్థలికి వెళ్లాలని పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ, లోకం నాగ మాధవిలను కాశీబుగ్గ ఘటన మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని…
Cyclone Montha: మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది జనసేన పార్టీ.. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తుఫాన్ సహాయక చర్యల్లో జనసేన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జనసైనికులు, వీర మహిళలు ముందుండాలని మంత్రి మనోహర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ యంత్రాంగానికి పార్టీ శ్రేణులు తగిన విధంగా…
ఆంధ్రప్రదేశ్ అధికార కూటమి భాగస్వాములైనా... ఫీల్డ్‌లో ఫ్రంట్ లైన్‌లో కనిపించడం లేదు జనసేన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది. దీంతో అసలు అలా ఎందుకు జరుగుతోందని రాజకీయ వర్గాలు ఆరా తీయడం మొదలైపోయింది. యూరియా కొరతలాంటి రైతు సమస్యలు, ప్రజల ఇతర ఇబ్బందులు, కూటమి పార్టీల హామీల అమలు లాంటి అంశాల్లో... వైసీపీ అటాకింగ్ మోడ్‌లోకి వెళ్తోంది.
2024 ఎన్నికల్లో జనసేనను బలంగా నిలబెట్టిన జిల్లాల్లో ఒకటి ఉమ్మడి పశ్చిమగోదావరి. ఇక్కడ మొత్తం 15 అసెంబ్లీ సీట్లు ఉంటే... ఆరు చోట్ల పోటీ చేసి గెలిచింది గ్లాస్ పార్టీ. అయినా సరే.... తమకు సరైన గుర్తింపు దక్కడం లేదని తెగ ఫీలైపోతున్నారట లోకల్ లీడర్స్. నిడదవోలు నుంచి గెలిచిన కందుల దుర్గేష్‌కు మంత్రి పదవి దక్కింది. ఆయనతో సహా... మిగతా నియోజకవర్గాల నేతలంతా... స్థానిక తెలుగుదేశం నాయకులు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని లోలోపల రగిలిపోతున్నట్టు…
Off The Record: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది జనసేన. జిల్లాలోని ఆరు సీట్లలో పోటీ చేసి అన్ని చోట్ల విజయం సాధించి కంచుకోటగా నిలబడింది. అలాంటి జిల్లాలో పార్టీ అధినేత ఆశించిందొకటి.. ఎమ్మెల్యేలు చేస్తున్నదొకటి అన్నట్టుగా తయారైందట పరిస్థితి. ఇక్కడి నుంచి తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన జనసేన నేతలు.. మళ్ళీ అవకాశం వస్తుందో లేదో… భవిష్యత్తు సంగతి మనకెందుకు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామన్నట్టు ఆత్రంగా వ్యవహరిస్తున్నారట.…
Pawan Kalyan Meets Janasena MLA’s in Vijayawada: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నేడు తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలతో పవన్ సమావేశం అయ్యారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు, అసెంబ్లీ కార్యక్రమాలపై ఎమ్మెల్యేలకు జనసేనాని అవగాహన కల్పించారు. వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్.. దీక్షా వస్త్రాలు ధరించి ఎమ్మెల్యేల అవగాహన…
రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని తీసుకురావాలి అని జనసేన చీఫ్ పవన్ పేర్కొన్నారు. కక్ష సాధింపునకు ఇది సమయం కాదు.. గతంలో అలా చేశారు కాబట్టి.. మనమూ అలాగే చేయాలని అనుకోవద్దు.. కక్ష సాధింపును నేను ఎంకరేజ్ చేయను అంటూ తెలిపారు. రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా అవతరించాం.. దేశంలో ఎవ్వరికి లేని రికార్డు 100 శాతం స్ట్రైకింగ్ రేట్ మనకు వచ్చింది.