Pawan Kalyan Meets Janasena MLA’s in Vijayawada: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నేడు తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలతో పవన్ సమావేశం అయ్యారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు, అసెంబ్లీ కార్యక్రమాలపై ఎమ్మెల్యేలకు జనసేనాని అవగాహన కల్పించారు. వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్.. దీక్షా వస్త్రాలు ధరించి ఎమ్మెల్యేల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలతో పవన్ భేటీ అయ్యారు.
Also Read: Semi Final Schedule: టీ20 ప్రపంచకప్ సెమీస్ షెడ్యూల్ ఇదే.. టీమిండియాతో తలపడేది ఎవరంటే?
సభలో రూల్ పొజిషన్, జీరో అవర్, ప్రశ్నోత్తరాలు, బిల్లుల ఆమోదం వంటి సాంకేతిక అంశాలను జనసేన ఎమ్మెల్యేలకు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. సభకు వచ్చే ముందు నియోజకవర్గంలో సమస్యలను అధ్యయనం చేసి రావాలని ఎమ్మెల్యేలకు పవన్ సూచనలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో తన శాఖల పరిధిలో జరిగిన నిధుల దారి మళ్లింపు వ్యవహారాలను ప్రస్తావించాలని పవన్ భావిస్తున్నారట. పంచాయతీ నిధులు, ఆర్ధిక సంఘం నిధుల మళ్లింపుపై ఇప్పటికే నివేదికివ్వాలని ఆదేశాలిచ్చారు. రూ. 5 వేల కోట్లకు పైగా నిధులను దారి మళ్లించారని ప్రాథమిక అంచనా.