తమిళ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ కెరీర్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం “జన నాయగన్”. హెచ్ వినోద్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ విషయంలో చట్టపరమైన చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉన్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, తాజాగా ఈ సినిమా సెన్సార్ విషయమై వివాదం తలెత్తి కోర్టు వరకు వెళ్లింది.…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ ముఖ చిత్రాలు వేగంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి-ఇండియా కూటమి అలర్ట్ అయ్యాయి. అధికారం కోసం రెండు కూటమిలు ఆరాటపడుతున్నాయి.
Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘జన నాయగన్’ సినిమా యూనిట్‌కు మద్రాస్ హైకోర్టు నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇవ్వాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో ‘జన నాయగన్’ సినిమా విడుదలపై తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది హైకోర్టు. Yash Toxic Teaser: యూట్యూబ్…
దళపతి విజయ్ ఆఖరి సినిమా ‘జన నాయగన్’ విడుదల వాయిదా పడటం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక అనూహ్యమైన పరిణామానికి దారితీసింది. సాధారణంగా ఒక సినిమా వాయిదా పడితే కొన్ని వందలు లేదా వేలల్లో రీఫండ్‌లు జరుగుతుంటాయి. కానీ, ఈ సినిమా విషయంలో ఏకంగా 4.5 లక్షల టికెట్లను బుక్‌మైషో రీఫండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే భారత సినీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో టికెట్లను క్యాన్సిల్ చేసి,…
ఈ మధ్య కాలంలో సినిమాలు వాయిదా పడటం కామన్ అయిపోయింది. అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ కూడా థియేటర్‌లో విడుదల అయ్యేంత వరకు నమ్మకం లేకుండా పోయింది. దీనికి నిదర్శనం బాలయ్య ‘అఖండ 2’. సినిమా విడుదలకు ఇంకో గంట టైం ఉంది అనగా వాయిదా పడి షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర కూడా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనవరి 9న రిలీజ్ కావాల్సిన దళపతి విజయ్ భారీ చిత్రం ‘జన…
జనవరి 9న విడుదల కానున్న రాజాసాబ్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే, సంక్రాంతి సీజన్‌లో టాలీవుడ్ నుంచి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఙప్తితో పాటు.. నారి నారి నడుమ మురారి, అనగనగ ఒక రాజు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలు రాజాసాబ్‌తో పోటీ పడడానికి సిద్ధమవుతున్నాయి. అయితే,…
Jana Nayagan vs Parasakthi: తమిళనాడులో రెండు సినిమాల మధ్య అరవ రాజకీయాలు హీటెక్కాయి. తమిళ స్టార్, టీవీకే అధినేత విజయ్ నటించిన ‘‘జన నాయగన్’’, శివకార్తికేయన్ నటించిన ‘‘పరాశక్తి’’ సినిమాల మధ్య వివాదం ముదురుతోంది.
జననాయగన్ ఫక్తు దళపతి విజయ్ సినిమా అంటూ మొన్నటి వరకు ఊదరగొట్టాడు దర్శకుడు హెచ్ వినోద్. ట్రైలర్ వచ్చాక అసలు స్వరూపం బయటపడింది. భగవంత్ కేసరికి కాపీ పేస్ట్ అంటూ విమర్శలొచ్చాయి. బాలకృష్ణను విజయ్ మ్యాచ్ చేయలేకపోతున్నాడని ఆల్రెడీ ఈ మూవీని వాచ్ చేసిన వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసమేనా కెవిన్ ప్రొడక్షన్ హౌస్ రూ. 380 కోట్లు ఖర్చుపెట్టింది అంటూ చర్చించుకుంటున్నారు. ఇదే కాదు.. విజయ్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా మారింది.…
జననాయగన్ బ్రేక్ ఈవెన్ తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం జననాయగాన్. H. వినోద్ దర్శకత్వం వహిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రేమలు బ్యూటీ మమిత బైజు కీలక పాత్ర పోషిస్తుంది. 2026 సంక్రాంతి కానుకగా జననాయగన్ ను జనవరి 9న రిలీజ్ కానున్న జననాయగన్ విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ నటిస్తున్న ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan). హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా పై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా, మన తెలుగు సూపర్ హిట్ ‘భగవంత్ కేసరి’ కి అధికారిక రీమేక్ అని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తే…