Jana Nayagan : ‘జన నాయగన్’ సెన్సార్ గండం దాటుతుందా? నేడే ఫైనల్ తీర్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ కెరీర్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం “జన నాయగన్”. హెచ్ వినోద్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ విషయంలో చట్టపరమైన చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉన్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, తాజాగా ఈ సినిమా సెన్సార్ విషయమై వివాదం తలెత్తి కోర్టు వరకు వెళ్లింది. దీనిపై నేడు చెన్నై హైకోర్టులో కీలక విచారణ జరగనుండటంతో కోలీవుడ్ మొత్తం ఈ తీర్పు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఇక ఈ రోజు వెలువడే తుది తీర్పు సినిమా భవితవ్యాన్ని, అలాగే తదుపరి విడుదల తేదీని నిర్ణయించనుంది.
Also Read : Rashmika Mandanna: ‘నేనేమీ హీరోని కాదు అంత తీసుకోవడానికి’.. రెమ్యునరేషన్ పుకార్లపై రష్మిక షాకింగ్ కామెంట్స్!
Also Read
ఈ భారీ ప్రాజెక్ట్‌ను కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుండగా, యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న చివరి సినిమా కావడంతో దీనిపై తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉంది. సెన్సార్ బోర్డు అభ్యంతరాల నేపథ్యంలో చిత్ర యూనిట్ కోర్టును ఆశ్రయించింది. ఒకవేళ కోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తే, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. లేనిపక్షంలో సినిమా మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో విజయ్ అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని, తమ నటుడిని వెండితెరపై చూసేందుకు ఆతృతగా ఉన్నామని పోస్టులు పెడుతున్నారు. నేడు వెలువడే కోర్టు తీర్పుపైనే ఈ ‘జన నాయగన్’ అదృష్టం ఆధారపడి ఉంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
-
Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
-
Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. కవల సోదరీమణుల్లో ఒకరికి మరణశిక్ష మరొకరికి 27 ఏళ్ల జైలు!
-
The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!
-
Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!