జమ్ము కశ్మీర్ లో రంగురంగు విరులు పర్యాటకులను కనువిందు చేశాయి. ప్రతి ఏడాది మాదిరిగానే పర్యాటకుల సందర్శనార్థం శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ ను అధికారులు మార్చ్ 19న తెరిచారు. దీంతో రంగురంగుల పూలను వీక్షించేందుకు పర్యాటకులు పోటెత్తారు. 30 రోజుల్లో రికార్డు స్థాయిలో 3.75 లక్షల మంది తులిప్ గార్డెన్ ను సందర్శించారు.
శ్రీనగర్‌లోని ప్రఖ్యాత తులిప్ గార్డెన్ పర్యాటకుల సంఖ్యలో కొత్త రికార్డును నెలకొల్పింది. శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఖ్యాతి అర్జెంటీనా వంటి సుదూర దేశాలకు చేరుకుంది.
Poonch terror attack: గురువారం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. పూంచ్ ఉగ్రదాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడిలో మొత్తం 7 గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు ప్రాథమికంగా నిర్థారించారు. రెండు ఉగ్రవాద గ్రూపులకు చెందినవారు పాల్గొన్నట్లు తేలింది.
Poonch Attack: భారతదేశంపై పాకిస్తాన్ తన కుట్రలను అమలు చేయడం ఆపడం లేదు. తినడానికి తిండి లేకున్నా కూడా పాకిస్తాన్ భారత్ పై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. భారత్ దినదినం అభివృద్ధి చెందుతుంటే, ఉగ్రవాద దేశంగా ముద్రపడిన పాకిస్తాన్ మాత్రం రోజురోజుకు ఆర్థిక, రాజకీయ సమస్యలతో పాతాళంలోకి కూరుకుపోతోంది. ఇంత జరుగుతున్నా కూడా భారత్ అంటే అదే ద్వేషం, అదే అక్కసు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ విభజన, అక్కడ శాంతిభద్రతల…
Poonch Attack: జమ్మూకాశ్మీర పూంచ్ జిల్లాలో గురువారం భీంజెర్ గలి నుంచి సాంగియోట్ కు వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పాటు గ్రెనెడ్స్ తో దాడి చేశారు. ఈ ఘటనలో భారత సైన్యానికి చెందిన ఐదుగురు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేట సాగిస్తున్నాయి. సైన్యంతో పాటు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది.
జమ్మూకశ్మీర్‌లో కథువా జిల్లాలోని తన పాఠశాలలో ప్రాథమిక సౌకర్యాలు ఉండేలా చూడాలని 3వ తరగతి విద్యార్థిని వీడియో సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీని కోరిన కొన్ని రోజుల తర్వాత.. జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ దానికి కొత్త రూపాన్ని ఇచ్చే పనిని ప్రారంభించింది.
Amarnath Yatra: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ప్రతీ హిందువు ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమూ ఆగస్టు 31 న ముగుస్తుందని జమ్మూ కాశ్మీర్ అధికారులు వెల్లడించారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్, గందర్బల్ జిల్లాలోని బల్తాల్ రెండు మార్గాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఆన్లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో రిజిస్ట్రేషన్ ప్రారంభించారు.
హిమాలయాల్లో కొలువైన అమర్నాథ్ ఆలయ యాత్ర జులై 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 62 రోజుల పాటు సాగే అమర్నాథ్ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31, 2023న ముగుస్తుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు మోడ్ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది.
Farooq Abdullah: సీబీఎస్ఈ సిలబస్ నుంచి మొగలుల చరిత్రకు సంబంధించి కొన్ని పాఠ్యాంశాలను తొలగించడం చర్చనీయాంశం అయింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ విద్యను కాషాయీకరణం చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. చరిత్రను చరిపివేయలేరని శనివారం అన్నారు.