కేంద్ర ప్రభుత్వం దేశ భద్రతపై పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. ఎలాంటి అనుమానితమైన చర్యలు కనిపించిన వాటిపై ఉక్కుపాదంమోపుతుంది. తాజాగా అనుమనిత మొబైల్ యాప్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి దూకుడు పెంచింది. దేశంలో అందుబాటులో ఉన్న 14 మొబైల్ యాప్ లను బ్లాక్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Also Read : America : కాలింగ్ బెల్ కొట్టినందుకు కారుతో గుద్ది కాటికి పంపాడు
ఈ యాప్ ల ద్వారా ఉగ్రవాదుల, ఉగ్రవాదుల మద్దతుదారులకు నడుమ కమ్యూనికేషన్ క్షేత్రస్థాయిలో దాడుల ప్రణాళికల చేరవేత, మరీ ముఖ్యంగా పాకిస్థాన్ నుంచి సూచనల రాకపోకలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రత్యేకించి జమ్ము కశ్మీర్ లో ఈ యాప్ ల వినియోగం ఎక్కువగా ఉంటోందని తేల్చింది. ఈ నేపథ్యంలోనే 14 మేసేజింగ్ యాప్ లను బ్లాక్ చేస్తున్నట్లు కేంద్ర సర్కార్ తెలిపింది. క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్వ్సిస్, విక్రమ్ , మీడియాఫైర్, బ్రియార్, బీఛాట్, నంద్ బాక్స్, కోనియన్, ఏఎంవో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జాంగి, త్రీమా యాప్ లను బ్లాక్ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Also Read : TS Eamcet: ఎంసెట్ హాల్ టిక్కెట్లు వచ్చేశాయ్.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా
భద్రతా, నిఘా వర్గాల రికమండేషన్ మేరకు.. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69ఏ ప్రకారం ఈ నిషేదం అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాదు.. ఆయా యాప్స్ ప్రతినిధులెవరూ భారత్ లో లేరని నిర్థారించుకున్న ట్లు సెంట్రల్ సర్కార్ పేర్కొంది. మెసేజింగ్ యాప్స్ పట్లు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు కేంద్రం ఓ ప్రకటనలో కోరింది. ఈలాంటి మేసేజింగ్ యాప్స్ నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.