Chopper Crash: జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. కిష్త్వార్ జిల్లాలోని మార్వా తహసీల్‌లోని మచ్చ్నా గ్రామ సమీపంలో గురువారం ఆర్మీ ఛాపర్ కూలిపోయింది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్ లో ముగ్గురు ఉన్నారు. పైలట్, కో పైలట్ గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. హిల్ మార్వా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆర్మీ అధికారుల తెలియజేసిన వివరాలు ప్రకారం హెలికాప్టర్ లో ఉన్న వారంతా సురక్షితంగా ఉన్నారు.
“ఆర్మీ ALH ధ్రువ్ హెలికాప్టర్ జమ్మూ & కాశ్మీర్‌లోని కిష్త్వార్ సమీపంలో కుప్పకూలింది. పైలట్లకు గాయాలయ్యాయి, అయితే సురక్షితంగా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చిలో అరుణాచల్ ప్రదేశ్ మండల కొండల ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ చీతా హెలికాప్టర్ కూలిపోవడంతో ఇద్దరు పైలెట్లు మరణించారు.