జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. దేగ్వార్ సెక్టార్‌లోని ఎల్‌ఓసీ సమీపంలో ఉగ్రవాదుల అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం అందిందని భద్రతా దళాలు తెలిపాయి. ఆ తర్వాత భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించారు. ఈ సమయంలో, ఉగ్రవాదులు భద్రతా దళాల బృందంపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రమూకలపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను హతమయ్యారు. Also…
కాంగ్రెస్ చారిత్రక తప్పిదాలను ప్రధాని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. కాంగ్రెస్ హయాంలోనే పీఓకేను భారత్ కోల్పోయింది.. నెహ్రూ చేసిన తప్పులకు భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందని మోడీ అన్నారు.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాల పర్యవసానాలను దేశం ఇప్పటికీ అనుభవిస్తోందన్నారు. అక్సాయ్ చిన్ కు బదులుగా, మొత్తం ప్రాంతాన్ని 'బంజరు భూమి'గా ప్రకటించారని.. దీని కారణంగా మనం దేశంలోని 38,000 చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోవలసి వచ్చిందన్నారు.
ఆ ముగ్గురు కరుడుగట్టిన ఉగ్రవాదులు. 26 మందిని చంపిన నరహంతకులు. యుద్ధంలో ఆరితేరిన వారు. అధునాతన ఆయుధాలు ప్రయోగించడంలో నైపుణ్యం కలిగిన వారు. అలాంటి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం మామూలు విషయం కాదు. ఎంతో ప్రణాళిక ఉండాలి.
పహల్గామ్‌లో మారణహోమం సృష్టించిన ముష్కరులు హతమయ్యారు. సైన్యం చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు కుక్కచావు చచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సైన్యం అధికారికంగా ధృవీకరించినట్లు ఆలిండియా రేడియో వైబ్‌సైట్‌లో పేర్కొంది.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లోని నియంత్రణ రేఖ సమీపంలో ల్యాండ్‌మైన్ పేలింది. ఈ ప్రమాదంలో భారత సైన్యంలోని జాట్ రెజిమెంట్‌కు చెందిన ఒక సైనికుడు (అగ్నివీర్) మరణించగా, ఒక జెసిఓ, ఒక సైనికుడు గాయపడ్డారు. గాయపడిన సైనికులను హెలికాప్టర్ ద్వారా ఉధంపూర్‌లోని ఆర్మీ బేస్ ఆసుపత్రికి తరలించారు. హవేలి తహసీల్‌లోని సలోత్రి గ్రామంలోని విక్టర్ పోస్ట్ సమీపంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ ల్యాండ్‌మైన్‌లను ఈ ప్రాంతంలో…
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన రెండు నెలల తర్వాత.. సైన్యం ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేసింది. పూంచ్, రాజౌరి జిల్లాల సరిహద్దులోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలో చొరబాటుకు ప్రయత్నిస్తుండగా పాక్ జాతీయుడిని అరెస్టు చేసింది. అయితే.. ఈ వ్యక్తికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. యూఎస్ తన ప్రయోజనాలను పొందే వరకు మాత్రమే ఇతర దేశాలతో ఫ్రెండ్షిప్ చేస్తుంది.. అలాగే, తనను తాను కాపాడుకునేందుకు ఏమైనా చేస్తుందని కామెంట్స్ చేశాడు.
ప్రధాని మోడీ ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ఈఫిల్ టవర్ కంటే పెద్దది. ఈ వంతెనను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. అయితే ఈ వంతెన ఇప్పుడు విమాన ప్రయాణికులకు టూరిస్ట్ ప్లేస్‌గా మారింది.
పహల్గామ్ ప్రాంతంలో సుమారు ఆరు వేలకు పైగా గుర్రాలు పర్యాటక సేవలకు రెడీగా ఉండగా, ప్రస్తుతం వాటిలో కేవలం 100 గుర్రాలకే పని లభిస్తుంది. దీని వల్ల రోజుకు సుమారు 2 కోట్ల రూపాయల మేర నష్టాన్ని మిగిలిస్తుంది. ఒక్కో గుర్రాన్ని సుమారు లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన యజమానులు, వాటికి ఇప్పుడు పని లేకపోవడంతో పాటు రోజూ రూ.400 విలువైన ఆహారం గుర్రాలకు పెట్టాల్సింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు అనుసంధానం ఇన్నాళ్లకు వాస్తవ రూపం దాల్చిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ శుక్రవారం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రపంచంలో ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని ప్రారంభించారు.