పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ అవినీతికి పాల్పడిందనే ఆరోపణల కేసులో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణకు పిలిచింది.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఐదుగురు ఆర్మీ జవాన్లను హతమార్చిన ఉగ్రదాడి ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో రెండు గ్రూపులకు చెందిన ఏడుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారని రక్షణ వర్గాలు తెలిపాయి.
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వివరణ ఇచ్చారు.
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో తమ వాహనం మంటల్లో చిక్కుకోవడంతో నలుగురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భాటా ధురియన్ ప్రాంతానికి సమీపంలో జరిగింది. పిడుగుపాటు కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
జమ్మూ కాశ్మీర్‌లో 62 రోజుల అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. ఈ యాత్ర జూలై 1న ప్రారంభమై ఈ ఏడాది ఆగస్టు 31న ముగుస్తుంది. అమర్‌నాథ్‌కు వెళ్లే రెండు మార్గాల్లో ఏకకాలంలో యాత్ర ప్రారంభమవుతుంది.
ఓ చిన్నారి తాను చదువుతోన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాల లేమిని ఏకంగా ప్రధాని మోదీకి తెలియజేయాలనుకుంది. తాను చదువుతున్న స్కూల్లో మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో ఆవేదన చెందిన చిన్నారి.. ‘మా స్కూల్ ఎంత చెత్తగా ఉందో చూడండి’ అని చూపిస్తూ వీడియోలో ప్రధాని మోదీ సాయం కోరింది.
PAN Aadhaar link : కేంద్ర ప్రభుత్వం పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి జూన్ 30, 2023ని గడువుగా నిర్ణయించింది. ఆ తర్వాత ఆధార్‌తో పాన్ కార్డ్‌ని లింక్ చేయని వ్యక్తుల పాన్ కార్డులు పనిచేయవు.
కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతని కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన జమ్మూలోని బనిహాల్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామాలోని మిత్రిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
India found deposit of lithium: ఇన్నాళ్లూ మనం పత్తి పంటను మాత్రమే తెల్ల బంగారమని అనుకునేవాళ్లం. కానీ.. లిథియం అనే ఖనిజాన్ని కూడా తరచుగా తెల్ల బంగారంగానే అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే.. ఇండియాలో ఇది ఇప్పటివరకూ చాలా చాలా తక్కువ మొత్తంలోనే దొరికేది. అందుకే.. అత్యంత విలువ కలిగిన బంగారంతో పోల్చారు. అయితే.. ఇప్పుడు ఈ లిథియం ఖనిజం భారతదేశంలో భారీగా ఉన్నట్లు గుర్తించారు.