అవినీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నుంచి సమన్లు అందిన మరుసటి రోజు జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ శనివారం ఢిల్లీలోని ఆర్కే పురంలోని పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. బస్సులో ఉన్న నాయకులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సత్యపాల్ ను అరెస్ట్ చేశారంటూ ప్రచారం మొదలైంది.
Also Read:Kerala BJP chief: కేరళలో ప్రధాని మోడీ హత్యకు కుట్ర.. బీజేపీకి బెదిరింపు లేఖ
అయితే, సత్యపాల్ ని అరెస్టు చేశారన్న వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. మాజీ గవర్నర్ సత్యపాల్ తన ఇష్టపూర్వకంగానే పోలీసు స్టేషన్‌కు వచ్చారని చెప్పారు. తాము మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను అదుపులోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆయన తన ఇష్టానుసారం తన మద్దతుదారులతో కలిసి ఆర్కే పురం పోలీస్ స్టేషన్‌కు వచ్చారని చెప్పారు. మాలిక్ తన ఇంటికి సమీపంలోని పార్క్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి పోలీసులు అభ్యంతరం చెప్పడంతో పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. నివాస ప్రాంతంలో అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, హర్యానా నుండి సమావేశానికి వచ్చిన మాలిక్, రైతు సంఘాలు, గ్రామ సంఘాల నాయకులు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు.
Also Read:Shriya : 20ఏళ్ల తర్వాత చిరుతో చిందేయనున్న శ్రియ
కాగా, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ అవినీతి ఆరోపణల కేసులో సాక్షిగా ఏప్రిల్ 28న గవర్నర్‌ను సీబీఐ విచారణకు పిలిచిన ఒక రోజు తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిర్దిష్ట వివరణల కోసం సెంట్రల్ ఢిల్లీలోని ఏజెన్సీ అక్బర్ రోడ్ గెస్ట్ హౌస్‌లో హాజరు కావాలని సిబిఐ కోరిందని మాలిక్ తెలిపారు. మాలిక్ 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. బీమా పథకంలో అవకతవకలు జరిగాయని మిస్టర్ మాలిక్ ఆరోపించగా, ఆ తర్వాత సీబీఐ చర్య తీసుకుంది.