పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ అవినీతికి పాల్పడిందనే ఆరోపణల కేసులో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణకు పిలిచింది. ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాలని సత్యపాల్ మాలిక్ ను సిబిఐ కోరింది. మాలిక్ 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా ఉన్నప్పుడు కంపెనీ ఒప్పందాన్ని రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను రూపొందించడంలో కుంభకోణం జరిగింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో పాటు ట్రినిటీ రీఇన్స్యూరెన్స్ బ్రోకర్లను సీబీఐ నిందితులుగా పేర్కొంది. బీమా పథకంలో అవకతవకలు జరిగాయని మాలిక్ ఆరోపించగా, ఆ తర్వాత సీబీఐ చర్య తీసుకుంది. దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగులను కవర్ చేసే ఈ పథకం సెప్టెంబర్ 2018లో రూపొందించబడింది. అయితే అప్పటి గవర్నర్ మాలిక్ దీనిని ఒక నెలలోనే రద్దు చేశారు.
Also Read:Asaduddin Owaisi: అతీఖ్ అహ్మద్ హత్య కేసు.. ఖరీదైన పిస్టళ్లను నిందితులకు ఎవరిచ్చారు?
బీమా కుంభకోణంపై సీబీఐ నోటీసుపై సత్యపాల్ మాలిక్ స్పందిస్తూ.. దర్యాప్తు సంస్థ కొన్ని వివరణల కోసం చూస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్‌ను మోసం అని గుర్తించినందున దానిని రద్దు చేయాలని కోరుతున్నారని, వివరాలను పరిశీలించిన తర్వాత తాను కూడా అదే నిర్ణయానికి వచ్చానని మాలిక్ చెప్పారు. తాను రాజస్థాన్ వెళ్తున్నాను కాబట్టి ఏప్రిల్ 27 నుండి 29 తేదీల్లో విచారణకు హాజరవుతానని సీబీఐకి చెప్పినట్లు సత్యపాల్ మాలిక్ తెలిపారు.
Also Read:Poonch Terror Attack: రెండు గ్రూప్ లు.. ఏడుగురు ఉగ్రవాదులు.. పూంచ్ దాడి పక్కా స్కెచ్
కిరు జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లో సివిల్ వర్క్ కాంట్రాక్టు ఇవ్వడంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై, బీమా సంస్థలపై చేసిన ఆరోపణల గురించి మరింత సమాచారం కోసం గత ఏడాది సెప్టెంబర్‌లో మాలిక్‌తో సీబీఐ మాట్లాడింది. గత ఏడాది ఏప్రిల్‌లో సత్యపాల్ మాలిక్ చేసిన అవినీతి ఆరోపణలపై సీబీఐ రెండు ప్రథమ సమాచార నివేదికలు (ఎఫ్‌ఐఆర్‌లు) దాఖలు చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని కిరు జలవిద్యుత్ ప్రాజెక్టుకు రూ.2,200 కోట్ల విలువైన ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య బీమా పథకం, సివిల్ పనులకు సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపునకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి.