ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు.. పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం.. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు.. ఇక, పలు అభివృద్ధి కార్యక్రమాల్లోని పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలే ఎప్పుడూ మండుతూ ఉంటాయనుకుంటే... అందులోనూ జమ్మలమడుగుకు ఇంకా మంటెక్కువ. ఫ్యాక్షన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ ఇది. అయితే... మొన్నటివరకు వేర్వేరు పార్టీల్లోని ప్రత్యర్థులు తలపడగా... ఇప్పుడు ఒకే పార్టీలోని నాయకులు ఢీ అంటే ఢీ అంటున్నారట. ఇద్దరు నేతల తీరేంటో అర్ధంగాక వైసీపీ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు సతమతం అవుతున్నట్టు సమాచారం
అక్కడ కూటమిలోని బాబాయ్, అబ్బాయ్ ఓ అండర్‌స్టాండింగ్‌తో పంచేసుకుంటున్నారా? నీకది, నాకిది అంటూ… వాటాలేసుకునమి మరీ ఎవరికి వాళ్ళు వసూళ్ళ పర్వంలో మునిగి తేలుతున్నారా? కాకుంటే… వాటికి కాంట్రాక్ట్‌లు అంటూ ముద్దు పేరు పెట్టుకుని మరీ లాగించేస్తున్నారా? ఎంత కొమ్ములు తిరిగిన కంపెనీ అయినాసరే…. వాళ్ళని కాదని అడుగు ముందుకేసే పరిస్థితి లేదా? ఎవరా బాబాయ్, అబ్బాయ్? ఏంటా బెదిరింపుల పర్వం? జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం…. ఒకప్పుడు ఫ్యాక్షన్ గడ్డ. ఇప్పుడు భారీ పరిశ్రమలకు అడ్డా. సాధారణంగా…
ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మాటకు కూడా విలువ లేకుండా పోతోందా? సీఎం చెబితే ఏంటి? మా దారి మాదే, మా బెదిరింపులు మావేనన్నట్టుగా ఎమ్మెల్యే అనుచరుల వ్యవహారం ఉందా? తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు బెదిరింపుల సెగ ఇప్పుడు ఏకంగా జాతీయ స్థాయి కంపెనీలనే టచ్ చేసిందా? వాళ్ళ దెబ్బకు ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితి వస్తోందా? ఏదా నియోజకవర్గం? ఏ ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు అవి? ఫ్యాక్షన్ రాజకీయాలకు పుట్టినిల్లు కడప జిల్లా జమ్మలమడుగు. ప్రత్యర్థుల…
మళ్లీ అధికారంలోకి వస్తాం.. జగన్ 2.0 వేరుగా ఉంటుంది.. ఈసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు మనదే పాలన ఉంటుందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కౌంటర్ ఎటాక్ చేశారు.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా కోల్పోయారు... 30 ఏళ్ల నా పాలన, 175 /175 ఎమ్మెల్యే, 25/25 ఎంపీలు అనే వారు అంటూ ఎద్దేశా చేశారు..
జమ్మలమడుగు పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటాయి. ఏదో ఒక సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతుంటాయి. ఇప్పుడిక్కడ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఢీ అంటే ఢీ అంటుండటం కాక రేపుతోంది. ఒకరిది ఇప్పుడు కాకున్నా... గతంలో ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఉన్న ఫ్యామిలీ. మరొక నాయకుడిది వ్యాపార కుటుంబం. జమ్మల మడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న రాజకీయం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కొత్త సమీకరణలకు దారి తీస్తోందని…
జమ్మలమడుగు రాజకీయాలు హిటేక్కాయి. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది... ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యా రోపణలతో విమర్శలు వర్షం కురుస్తోంది. హేమాహేమీ నేతల మధ్య మాటల యుద్ధం ఎటువైపు దారితీస్తుందోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
జమ్మలమడుగులో కొత్త జాతర మొదలైంది! అదేనండీ.. పొలిటికల్ జాతర! ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క..! అన్నొచ్చాడని చెప్పండని ఆయన తొడగొడుతున్నాడు! ఇన్నాళ్లున్న సైలెంటుగా ఉండి ఇప్పుడొక్కసారిగా జై జమ్మలమడుగు అన్నాడు. మరి ఇంతకాలం చక్రం తిప్పిన ఇంకో లీడర్ ఎక్కడ? ఆయన ఎటు వెళ్లారు? రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. గెలస్తారు.. ఓడుతారు! ఫీల్డులో ఉండాలి.. ఫైట్ చేయాలి! ఎవరైనా ఇదే సూత్రంతో రాజకీయాలు నడుపుతుంటారు. కానీ జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డికి…
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ అధికారిగా జమ్మలమడుగు డీఎస్పీ యశ్వంత్‌ను ప్రభుత్వం నియమించింది. సార్వత్రిక ఎన్నికల ముందు జమ్మలమడుగు డీఎస్పీగా యశ్వంత్ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలు నిక్కచ్చిగా జరిపారని యశ్వంత్ పేరు పొందారు.
కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఉద్రిక్తత కొనసాగుతుంది. దీంతో సిటింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి దగ్గర భద్రతను పెంచారు. రాత్రి హైదరాబాద్ నుంచి ఎర్రగుంట్ల మండలం నిడిజువ్వికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పోలీసులు గన్ మెన్ సౌకర్యం కూడా పెంచారు.