కడప జిల్లా జమ్మలమడుగులో పరిస్థితులను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సమీక్షించారు. ఎన్నికల రోజు పోలీసుల పనితీరు భేష్ అంటూ ఆయన ప్రశంసించారు. జమ్మలమడుగులో ఎన్నికల రోజు తలెత్తిన వివాదాలను పోలీసులు చాకచక్యంగా అణిచివేశారని.. పోలీసులు ప్రాణాలకు తెగించి చాలెంజింగ్‌గా పరిస్థితులను అదుపు చేశారని చెప్పుకొచ్చారు.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆది నారాయణ రెడ్డి, కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
కడప జిల్లా జమ్మల మడుగులో నిన్న ( సోమవారం ) వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్ కేంద్రం దగ్గర వైసీపీ, బీజేపీ నాయకుల మధ్య తోపులాట, రాళ్లదాడి చేసుకున్నారు. నేడు మళ్ళీ తిరిగి కవ్వింపు చర్యలకు వైసీపీ, టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు.
Off The Record: ఒకప్పుడు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డికి అనుంగుడుగా ఆయన సమీప బంధువు గంగవరం శేఖర్‌రెడ్డి ఉన్నారు. అయితే కొంతకాలంగా ఆయన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేని కాదని నియోజకవర్గంలో సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే వల్ల నష్టపోయిన, నిర్లక్ష్యానికి గురైన నేతలను దగ్గరకు తీసుకుని వర్గం ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే అసమ్మతి నేతల వర్గానికి ఆయనే నాయకత్వం కూడా వహిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా గంగవరం శేఖర్‌రెడ్డి నియోజకవర్గంలో తన…
2019 నుంచి మారిన జమ్మలమడుగు రాజకీయం జమ్మలమడుగు. ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు రాజకీయాలు మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిల చుట్టూనే తిరిగేవి. 2019 ఎన్నికలతో వీరిద్దరికీ చెక్ పడింది. రాజకీయం కూడా మారిపోయింది. కొత్త వ్యక్తి డాక్టర్ సుధీర్‌రెడ్డి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. హోంశాఖ మాజీ మంత్రి మైసూరారెడ్డికి స్వయాన సోదరుడి కుమారుడే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి. ఈ బంధుత్వం ఈ తొలిసారి ఎమ్మెల్యేకు ఎన్నికల్లో కలిసొచ్చింది. గత ఎన్నికల తర్వాత రామసుబ్బారెడ్డి టీడీపీని వీడి వైసీపీలోకి…
నవ్వి పోవుదురుగాక నాకేంటి అనే చందాన ఉంది ఆ ఇద్దరు నేతల తీరు. చీకటి ఒప్పందం చేసుకుని కంకర కోసం కొండలు మాయం చేస్తున్నారట. ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి సొంత ఖజానా నింపుకొంటున్నారట. వారెవరో.. ఏంటో.. లెట్స్ వాచ్..! ప్రశ్నించేవాళ్లు లేరు.. నేతలదే రాజ్యం కడప జిల్లా జమ్మలమడుగులో అక్రమ మైనింగ్ యధేచ్చగా జరుగుతోంది. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు.. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఒప్పందం కుదిరిందట. దానిని ప్రశ్నించేవారే లేకపోవడంతో వాళ్లదే రాజ్యం.…
ఆ వ్యక్తిపై పార్టీకి నమ్మకం లేదా? పార్టీని భుజాన వేసుకుని తిరుగుతున్నా అధిష్ఠానం నమ్మడం లేదా? సొంత కుటుంబం నుంచే ఆ మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్ ఇబ్బందిలో పడబోతుందా? ఎవరూ ఊహించని విధంగా బీజేపీలో చేరిన ఆదివైసీపీలో గెలిచి టీడీపీలో చేరి.. మంత్రి పదవి పట్టేశారు ఆదినారాయణరెడ్డి. మంత్రి అవడమే జిల్లా మొత్తం పెత్తనం చేశారు. పార్టీ అవసరాలలో భాగంగా ఆగర్భ శత్రువు రామసుబ్బారెడ్డితో రాజీ పడి 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు వదిలి కడప ఎంపీగా…