రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారుల ముఖ్య సమావేశం జరగబోతోంది. దీంతో జైపూర్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు హై అలర్ట్ ప్రకటించారు. నేటి సాయంత్రం జరిగే డీజీ-ఐజీ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోశాఖ మంత్రి అమిత్ షా జైపూర్ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి వీవీఐపీలు ఈ సదస్సుకు వస్తుండటంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
Read Also: Kesineni Nani: ఎంపీ కేశినేని నాని తీవ్ర అసంతృప్తి.. పార్టీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు..!
అలాగే, ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల డీజీలు, ఐజీలు పాల్గొంటున్నారు. దీంతో పాటు 8 కేంద్ర పాలిత ప్రాంతాల ఐజీ పోలీసులు కూడా ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. అయితే, ఈ సదస్సుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో పోలీసు వ్యవస్థ, అంతర్గత భద్రతపై మేధోమథనంతో పాటు కొత్త క్రిమినల్ చట్టాల అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్‌పై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ మహామంథన్‌లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) స్థాయికి చెందిన 250 మంది ఉన్నతాధికారులు పాల్గొంటారని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా పోలీసులు ఆన్‌లైన్‌లో పాల్గొనబోతున్నారు.