ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం సాయంత్రం జైపూర్‌కు చేరుకున్నారు. ఆయనకు జంతర్ మంతర్ వద్ద ప్రధానమంత్రి మోడీ స్వాగతం పలికారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ కరచాలనం చేసి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు చారిత్రక జంతర్‌మంతర్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కాగా.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. రెండ్రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు.
Vijayawada: రేపు గణతంత్ర దినోత్సవ వేడుకలకు సీఎం.. షెడ్యూల్ ఇదే..!
ప్రత్యేక విమానంలో జైపూర్ చేరుకున్న మాక్రాన్.. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ స్వాగతం పలికారు. అనంతరం మాక్రాన్ కాన్వాయ్ విమానాశ్రయం నుండి అమెర్ కోటకు వచ్చింది. దారిలో పలుచోట్ల పాఠశాల విద్యార్థులు, సామాన్య ప్రజలు కాన్వాయ్‌కు స్వాగతం పలికారు. మాక్రాన్ చాలా చోట్ల కరచాలనం చేస్తూ చిన్నారులను పలకరించారు. కోటలో అక్కడున్న వారితో మాట్లాడటం, వారితో ఫోటోలు దిగాడు. అనంతరం ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు.
#WATCH | PM Modi and French President Macron visit Jantar Mantar, the famous solar observatory established by Maharaja Sawai Jai Singh, in Rajasthan's Jaipur pic.twitter.com/n7ZWxCuYtO
— ANI (@ANI) January 25, 2024
CM Jagan: గిరిజన ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. 300 సెల్ టవర్స్ ప్రారంభం
ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ, మాక్రాన్ జంతర్ మంతర్ నుండి హవా మహల్ వరకు రోడ్ షో నిర్వహించారు. సాయంత్రం హోటల్ రాంబాగ్ ప్యాలెస్‌లో సమావేశం కానున్నారు. రాత్రికి ఇద్దరు నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కాగా.. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ రెండు రోజుల పర్యటనలో భారత్‌తో పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికత తదితర రంగాల్లో ఒప్పందాలు చేసుకోనున్నట్లు సమాచారం.
#WATCH | PM Modi and French President Emmanuel Macron hold roadshow in Rajasthan's Jaipur pic.twitter.com/jEC3PSt8KW
— ANI (@ANI) January 25, 2024