తెలుగు చిత్రసీమలో కళావాచస్పతి జగ్గయ్య హీరోగా రాణించారంటే అందుకు దర్శకనిర్మాత కె.బి.తిలక్ ప్రధానకారకులని చెప్పకతప్పదు. తిలక్ తమ ‘అనుపమ ఫిలిమ్స్’ పతాకంపై తెరకెక్కించిన అనేక చిత్రాలలో జగ్గయ్యనే కథానాయకునిగా ఎంచుకున్నారు. అలా వారి కాంబోలో తెరకెక్కిన ‘ఈడూ-జోడూ’ చిత్రం అప్పట్లో జనాదరణ పొందింది. 1963 మే 17న ‘ఈడూ-జోడూ’ విడుదలై విజయం సాధించింది. Read Also: Girl’s mind: అమ్మాయిల విషయంలో పురుషులు చేసే తప్పు ఏంటో తెలుసా? ఇంతకూ ‘ఈడూ-జోడూ’ కథ ఏమిటంటే – సుందరమ్మ…
(అక్టోబర్ 22తో ‘రామాలయం’ చిత్రానికి 50 ఏళ్ళు)మహానటులు యన్టీఆర్, ఏయన్నార్ టాప్ స్టార్స్ గా రాజ్యమేలుతున్న రోజుల్లో వారి చిత్రాల్లో సైడ్ హీరోస్ గా నటించేవారు జగ్గయ్య, కాంతారావు. తరువాతి రోజుల్లో వారిద్దరూ సోలో హీరోస్ గా రాణించారు. తమకంటూ కొంతమంది నిర్మాతలను సంపాదించుకొన్నారు. అయితే తమకు లభించిన కేరెక్టర్ రోల్స్ ను మాత్రం జగ్గయ్య, కాంతారావు వదలుకోలేదు. అలా సాగుతూనే వారికి తగ్గ పాత్రల్లో నటించి అలరించారు. జగ్గయ్య హీరోగా రామవిజేతా ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన…
(సెప్టెంబర్ 3న జమున ‘బంగారుతల్లి’కి 50 ఏళ్ళు) కళారంజని జమున అభినయ పర్వంలో మరపురాని చిత్రాలు అనేకం. వాటిలో ‘బంగారుతల్లి’ మరింత ప్రత్యేకం. హిందీలో నర్గీస్ ప్రధాన పాత్ర పోషించిన ‘మదర్ ఇండియా’ ఆధారంగా ‘బంగారు తల్లి’ తెరకెక్కింది. ‘మదర్ ఇండియా’ టైటిలే జనాన్ని విశేషంగా అలరించింది. ఇక ఆ సినిమా పలు ప్రత్యేకతలకు వేదికగా నిలచింది. ఆ చిత్ర దర్శకనిర్మాత మెహబూబ్ ఖాన్ 1940లోనే ‘ఔరత్’ అనే సినిమా తెరకెక్కించారు. అందులో భర్త చనిపోయి, ఇద్దరు…