ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా రెండు పొలిటికల్ పార్టీలు మాత్రమే ఉండేవి. ఒకటి.. కాంగ్రెస్. రెండు.. తెలుగుదేశం. కాబట్టి ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేవి. ఒక పార్టీ మహాఅయితే వరుసగా రెండు సార్లు మాత్రమే గెలిచేది. అందువల్ల పదేళ్ల తర్వాత మరో పార్టీకి ఛాన్స్ వచ్చేది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ పేరుతో స్వేచ్ఛగా ఒకరినొకరు విమర్శించుకునేవారు. హస్తం పార్టీలో ఎప్పుడూ రెండు,…
సంచలన నిర్ణయానికి ఇంకా సమయం ఉందని.. అది ఏదైనా కాంగ్రెస్ పార్టీ మంచికోసమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి పార్టీ కోసమే మాట్లాడతారని.. పార్టీ ఎదుగుదల కోసమే మాట్లాడతారని ఆయన తెలిపారు. తాను ఏది మాట్లాడినా కాంగ్రెస్ ఎదుగుదల కోసమే మాట్లాడతానన్నారు. పార్టీలో ఉంటాడా.. పోతాడా అనేది మనసులో నుంచి తీసేయాలన్నారు. కాంగ్రెస్ నాయకులు తన వ్యాఖ్యలను నెగెటివ్‌గా తీసుకోవద్దన్నారు. TS Police Jobs: కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల తేదీలు ఖరారు.. జగ్గారెడ్డి ఇక్కడే…
తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రచ్చబండ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు మధ్య ఉన్న పాత విభేదాలను బయటపెట్టింది. సంగారెడ్డి జిల్లాలో రచ్చబండ కేవలం రెండు నియోజకవర్గాల్లోనే కొనసాగుతుంది. రెండు చోట్లా పోటా పోటీగా ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండువర్గాలుగా విడిపోయింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి నాయకత్వంలో ఓ వర్గం, పార్టీ నాయకుడు నరోత్తమ్ ఆధ్వర్యంలో మరోవర్గం ఎవరికి వారే రచ్చబండ నిర్వహిస్తోంది. ఒకవర్గం నిర్వహించే కార్యక్రమాలకు మరోవర్గం…
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నిపథ్’పై నిరసన, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వం సం చేశారు. పలు రైళ్లకు నిప్పు పెట్టారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలను చేపట్టింది. వయోపరిమితి సడలింపుతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు.…
తెలంగాణ కాంగ్రెస్లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నేతలు ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా గవర్నర్ తమిళి సై నిర్వహించిన మహిళా దర్బార్పై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మహిళా దర్బార్ని స్వాగతించారు. అంతేకాదు… రాష్ట్రంలో గవర్నర్ పాలన పెట్టినా బాగుంటుందన్నారు రేవంత్. తెలంగాణ ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి ఎవరు లేనప్పుడు కనీసం గవర్నర్ అయినా వింటే మంచిదే కదా అన్నారాయన. ఇంత వరకు బాగానే ఉన్నా… పార్టీ వర్కింగ్…
తెలంగాణలో చరిత్ర కలిగిన శివాలయ అభివృద్ధికి నిధులు ఏదైనా తెచ్చవా..? మసీదు తవ్వితే శివ లింగాల గురించి పక్కన పెట్టు.. కాకతీయుల కాలం నుంచి ఉన్న శివాలాయాలకు నిధులు ఏమైనా ఇప్పించావా.? అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సంగారెడ్డి లో కల్పకుర్ గ్రామంలో వెయ్యేళ్ళ క్రితం శివాలయం ఉందని.. ఈ దేశాలయానికి కేంద్రం నుంచి నిధులు ఇప్పంచు అని డిమాండ్ చేశారు. తవ్వకాలు వదిలి, భూమి మీద…