సంచలన నిర్ణయానికి ఇంకా సమయం ఉందని.. అది ఏదైనా కాంగ్రెస్ పార్టీ మంచికోసమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి పార్టీ కోసమే మాట్లాడతారని.. పార్టీ ఎదుగుదల కోసమే మాట్లాడతారని ఆయన తెలిపారు. తాను ఏది మాట్లాడినా కాంగ్రెస్ ఎదుగుదల కోసమే మాట్లాడతానన్నారు. పార్టీలో ఉంటాడా.. పోతాడా అనేది మనసులో నుంచి తీసేయాలన్నారు. కాంగ్రెస్ నాయకులు తన వ్యాఖ్యలను నెగెటివ్‌గా తీసుకోవద్దన్నారు.
TS Police Jobs: కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల తేదీలు ఖరారు..
జగ్గారెడ్డి ఇక్కడే ఉండి పార్టీని డ్యామేజ్ చేస్తున్నారా..? అనుకోవద్దుంటూ ఆయన అన్నారు. తనకు ఎవరు చెప్పినా విననని.. ఎవరికి లాలూచీ పడనన్నారు. తన స్టేట్‌మెంట్‌లతో ఎవరూ కన్ఫ్యూజ్ కావద్దన్నారు. మేము తిట్టుకోవడం వ్యూహమే అనుకోవాలన్నారు. రాజకీయాల్లో ఎత్తుగడలు ఉంటాయని.. రేవంత్.. తాను గొడవ పడేది కూడా ఎత్తుగడనే అనుకోవాలని జగ్గారెడ్డి అన్నారు. మొన్నటి వ్యాఖ్యలపై నో కామెంట్స్ అని జగ్గారెడ్డి వివరాలు వెల్లడించలేదు. సంచలన ప్రకటన ఏముంటుందనేది సమయమే డిసైట్ చేస్తుందన్నారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని.. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువస్తామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభ ఫెయిల్ అయిందన్నారు. 10 లక్షల మంది తో సభ అన్నారని… కానీ గ్రౌండ్ కెపాసిటీ లక్ష మాత్రమేనని .. వచ్చింది మాత్రం 50 వేల మందేనని ఆయన అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. ఎట్టకేలకు కాంగ్రెస్‌ను రాష్ట్రంలో అధికారంలోకి రానీయకుండా చూడడమే వారి ధ్యేయమని ఆయన విమర్శించారు.