తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఉరఫ్ జగ్గారెడ్డి వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో వివిధ రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఆయన త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరతానే ప్రచారం ఊపందుకుంది. పార్టీ అధిష్టానం తీరుపై ఆయన అసహనం వెళ్ళగక్కుతున్న సంగతి తెలిసిందే. తనను కోవర్ట్ అంటూ రేవంత్ రెడ్డి అనుచరులే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. పార్టీ వ్యవహారాలపై మాట్లాడవద్దని జగ్గారెడ్డి భావించారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా…
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసిన చరిత్ర సోనియాగాంధీది. వైద్యం కోసం ఆరోగ్య శ్రీ తెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్. రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అంటే మమ్మల్ని నమ్మలేదు జనం. ఒకసారి లక్ష మాఫీ చేస్తాం అని చెప్పిన కేసీఆర్‌ని నమ్మి ఓటేశారు. రైతులు నమ్మి ఓటేస్తే రుణమాఫీ ఇప్పటికీ జరగలేదన్నారు జగ్గారెడ్డి. కానీ లక్ష కు లక్ష వడ్డీ అయ్యింది. కేసీఆర్‌ని నమ్మి రైతులు నమ్మి ఓటేస్తే…
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసిన చరిత్ర సోనియాగాంధీది. వైద్యం కోసం ఆరోగ్య శ్రీ తెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్. రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అంటే మమ్మల్ని నమ్మలేదు జనం. ఒకసారి లక్ష మాఫీ చేస్తాం అని చెప్పిన కేసీఆర్‌ని నమ్మి ఓటేశారు. రైతులు నమ్మి ఓటేస్తే రుణమాఫీ ఇప్పటికీ జరగలేదన్నారు జగ్గారెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్‌లో డీసీసీ అధ్యక్షుల వాయిస్ పెరిగిందా..? పీసీసీ లక్ష్యంగా ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు? ఆ వ్యాఖ్యల వెనక ఏదైనా వ్యూహం ఉందా? లేక పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహారం నడిపించారా? రేవంత్ అందుబాటులో ఉండటం లేదని డీసీసీల ఫిర్యాదుతెలంగాణ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పార్టీ సభ్యత్వాలు చేయించాలని చెబుతుంటే..! సరే.. మా సంగతేంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నల వెనక వ్యూహం ఏంటి? జిల్లాలలో ఉన్న అసంతృప్తిని పీసీసీ దృష్టికి…
శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీనే క్రమశిక్షణ తప్పిందా? ఇన్నాళ్లు క్రమశిక్షణ కమిటీపై రాని ఆరోపణల ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? చిన్నారెడ్డి కామెంట్స్‌తో మరో మలుపు తిరిగిన రగడతెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లక్ష్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. మెదక్ పర్యటన సమాచారం ఇవ్వలేదనే అంశంపై మొదలై.. రేవంత్ కూడా కోవర్టే అనే వరకు విమర్శలను…
కాంగ్రెస్ పార్టీలో ఎవరి ఎజెండా వారిది కాదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజల అజెండానే మా ఎజెండా. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు వరి ధాన్యం సమస్య రాలేదు. ఎంతో కష్టపడి తెగుళ్ళతో పోరాడి పంట పండిస్తే వరి ధాన్యం కొనుగోలు చేయమంటే రైతులు ఏం చేయాలి. తెలంగాణ రాష్ట్ర సమితి ఆడుతున్న నాటకంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతుల కోసమే మేం ప్రయత్నిస్తున్నాం. నేతలు ఎక్కడికక్కడ రైతులకు భరోసా ఇస్తున్నాం. చేసే…
తెలంగాణలో వరిధాన్యం సమస్య వెనుక బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర వుందని మండిపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ మంత్రులు కొత్త డ్రామా ఆడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వైపు జనం చూస్తున్నారు కాబట్టి బీజేపీ-టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయన్నారు. వరి ధాన్యం కొనుగోలు వెనుక బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ కుట్ర వుందని ఆరోపించారు జగ్గారెడ్డి. సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోతేనే సమస్య పరిష్కారం కాలేదు. మంత్రులవల్ల ఏం అవుతుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాని…
కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డిలో పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ సి.ఎస్.ఐ చర్చ్ వరకు పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని పాదయాత్ర నిర్వహించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ సందర్భంగా జగ్గా రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 60 రూపాయలు ఉన్నా పెట్రోల్ రూ.110 లకు పెరిగిందని.. రూ. 600 ఉన్న గ్యాస్ ధర.. వెయ్యి రూపాయలు పెరిగాయన్నారు. దీనివల్ల పేద మధ్య,తరగతి కుటుంబాలకు ఆర్థిక…
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, సౌమ్యుడు రోశయ్య మరణం తీరని లోటు అని రాజకీయ నేతలు నివాళులర్పించారు. రోశయ్య అందరికీ సూపరిచితులు…ఆయన మరణం బాధ కలిగించింది. ఆయన లేకపోవడం రాజకీయాల్లో తీరని లోటు అన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి. రాజకీయాల్లో ఆయన ఎన్నో పదవులు అనుభవించారు. ఎవరికీ ఇబ్బంది కలిగించే వ్యక్తి కాదు, శాంతమూర్తి. ఎన్నో చరిత్రలు రోశయ్య సొంతం అన్నారు జగ్గారెడ్డి. ఆయనో స్వాతంత్ర్య సమరయోధుడు. నేను అందరికీ…
గడిచిన రెండేళ్లలో రాష్ర్టంలోని ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ర్టంలో ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదు. నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ఎమ్మెల్సీ అభ్యర్థులను పెట్టినందుకు వారిని గౌరవిస్తున్నారన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు లేవని ఆయన స్పష్టం చేశారు. జిల్లా నాయకులు, దామోదర్, గీత రెడ్డితో మాట్లాడి ఎమ్మెల్సీ అభ్యర్థిని…