ఏపీలో లిక్కర్ రాజకీయం నడుస్తోంది. తాము అధికారంలోకి వస్తే రూ.50కే మందు అందిస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన కామెంట్లు కాక పుట్టిస్తున్నాయి.ప్రజాగ్రహ సభ కాస్త బీజేపీపై ఆ్రగహానికి కారణం అయింది. ఏపీ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగు మీడియానే కాదు జాతీయ మీడియా సైతం ఆయన ప్రసంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. సోము చేసిన వ్యాఖ్యలతో సభ ఉద్దేశం దారి మళ్ళిందంటున్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ఆర్థిక పరిస్థితి బాగుంటే 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామనీ చెప్పుకొచ్చారాయన. రాష్ట్రంలో కోటిమంది తాగుతున్నారని, వారంతా బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
సోము కామెంట్లపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బీజేపీపై విమర్శల దాడి చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇప్పటికే విరుచుకుపడ్డారు. మరోసారి సంచలన వాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. సోము వీర్రాజు కాదు కదా….ఆయనను పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా సీఎం జగన్ ని జైలుకు పంపలేరు. ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేస్తున్నా….సోము వీర్రాజు లాంటి వారు అధ్యక్షులుగా వుంటే… బీజేపీకి డిపాజిట్లు కూడా రావంటున్నారు. చీఫ్ లిక్కర్ ఇచ్చి….ఓట్లు అడిగే దౌర్బాగ్యస్థితికి సోము వీర్రాజు చేరుకున్నారని విమర్శించారు నారాయణస్వామి. తెలుగుదేశం అజెండానే బీజేపీ అమలుపరుస్తోందన్నారు నారాయణస్వామి.