ఏపీ సీఎం జగన్ దావోస్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దావోస్ వేదికగా జగన్ రెడ్డి చెబుతున్నవన్నీ నిజాలేనా..? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంబులెన్సులు ఉండవు… సెక్యూరిటీ గార్డు, స్వీపర్లు కుట్లు వేసి కట్లు కడతారని చెప్పాల్సింది. కోవిడ్ కాలంలో కేంద్రం ఇచ్చిన నిధులు ఎటుపోయాయి? వైసీపీ ఆర్థిక అరాచకం వల్లే విదేశీ పెట్టుబడులు రావడం లేదన్నారు పవన్. ఏపీలో వైద్యారోగ్య రంగం వెలిగిపోతోందంటూ దావోస్ వేదికగా జగన్ చెప్పిన మాటలను ప్రజలు…
నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ అనూహ్యంగా జగన్ మొదటి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. సీనియర్ నేతలు ఎందరో ఉన్నా అనిల్ కుమార్‌కు జగన్ అవకాశం ఇచ్చారు. కీలకమైన భారీ నీటిపారుదల శాఖకు మంత్రి అయ్యారు. మూడేళ్ల సమయంలో అనిల్ తనదైన శైలిలో కొనసాగారు. గత నెలలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సర్వేపల్లి ఎంఎల్‌ఏగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి స్థానం దక్కింది. అనిల్ కుమార్ మాజీ అయ్యారు. మరుసటి రోజే…
రాజకీయాల్లో పదవుల కోసం ఆశపడడం, అవి లభించకపోతే అసహనానికి, అసంతృపికి గురికావడం షరా మామూలే. కానీ అనంతపురం జిల్లాలో ఇద్దరు నేతల తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వారిద్దరూ మంత్రి ఆశించి భంగపడ్డారు. నిరాశ నిస్పృహలతో ఉంటారనుకుంటే.. జిల్లాలోకి భారీగా హంగామాతో ఎంట్రీ ఇచ్చారు. భారీ కాన్వాయిలు, గజ మాలలతో ఎంట్రీ ఇచ్చారు. తూచ్.. మంత్రి పదవి కాదు మాకు కావలసింది.. మాకు అసంతృప్తి లేదు.. పార్టీనే ముఖ్యమంటూ సందేశాలు ఇస్తున్నారు. అనంతలో ఇద్దరు నేతలు చేసిన తీరు…
డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఐఏఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేష్ పై నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం సంక్షేమ పథకాలు ఇస్తుంటే.. మాజీ ఐఏఎస్‌లు ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్ వంటి వారికి నచ్చడం లేదేమో..? మాజీ ఐఏఎస్ ఎస్సార్ శంకరన్ పేదల కోసం ఏం చేశారో గమనించాలి. ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్ పేదలను అగర్భ శత్రువులుగా చూస్తున్నారు. ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్…
మంత్రి అంటే పదవి కాదు..బాధ్యత. అందరి సూచనలతో రాష్ట్రాన్ని వ్యవసాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. మంత్రి అయినా..రాష్ట్ర స్థాయి బాధ్యతలు వున్నా అందరికీ అందుబాటులో ఉంటానన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఆదాల ప్రభాకర్ రెడ్డి …నేను కలిసి పని చేశాం. నేను ఈ స్థాయికి రావడానికి ఆనం కుటుంబం ఎంతో దోహదం చేసింది. వ్యవసాయ శాఖ అంటే ఎంతో కీలకం. 70 శాతం మంది ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మంత్రిగా అవకాశం…
ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడిపై ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు తప్పుబడుతున్నారని మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఏపీ ప్రజలు జగన్ శాశ్వత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని నమ్ముతున్నారు. లోకేష్ బాబు ఆయన బాబు చంద్ర బాబు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు.ఎల్లో మీడియా అమ్మ ఒడి పథకంపై నానా తప్పులు రాస్తుందన్నారు. తల్లిరొమ్ము పాలు తాగిన ఏ వ్యక్తి అమ్మ ఒడిని విమర్శించరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం తీసుకువచ్చింది. హైదరాబాద్ లో మంత్రి ఆదిమూలపు…
ఏపీలో కేబినెట్ కూర్పు తర్వాత అసంతృప్తి బయటపడుతూనే వుంది. కేబినెట్లో మార్సులు, కొత్త మంత్రులపై విపక్షాలు మండిపడుతూనే వున్నాయి. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కేబినెట్ కూర్పులో అవమానించబడ్డ చాలా మంది ఓదార్పు కోరుకుంటున్నారన్నారు. బాధల్లో ఉన్న వాళ్ళను ఓదార్చడం రాజకీయాల్లో సహజం అన్నారు. త్వరలో బీజేపీలోకి విస్త్రతమైన చేరికలు ఉంటాయని జోస్యం చెప్పారు ఎంపీ జీవీఎల్. బీజేపీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమైన ఎవరికైనా తలుపులు తెరిచే ఉంటాయన్నారు. ఉత్తరాంధ్రలో తూర్పు…
ఏపీలో కేబినెట్ ప్రక్షాళన అనంతరం కొన్నిచోట్ల అసంతృప్తులు బయటపడ్డాయి. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత అసహనంతో వున్నారని, ఆమె రాజీనామా చేశారనే వార్తలు వచ్చాయి. అయితే ఇవాళ సీఎం జగన్ తో భేటీ అయ్యారు సుచరిత. పార్టీ, సీఎం జగన్ ఎంతో గౌరవించి.. పదవులు కట్టబెట్టారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అన్నారు. కొంత మందిని తొలగిస్తామని.. కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని జగన్ చెప్పారు. మమ్మల్ని…
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొనసాగించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు ఐ అండ్ పీఆర్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయాలకు క్యాబినెట్ అద్దంపట్టేలా ఉందన్నారు. పూలే ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారని కొనియాడారు. https://ntvtelugu.com/jagan-new-cabinet-ministers-portfolios/ బీసీలలో పేదరికాన్ని తరిమేందుకు, విద్యను గ్రామస్థాయిలో అందేలా సీఎం పథకాలు అమలుచేశారు. స్వాతంత్ర్యం తర్వాత బీసీలకోసం ఇంతలా ఆలోచించిన నాయకులు లేరు. ప్రభుత్వంపై బురదచల్లేలా ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సినీ పరిశ్రమ ఇబ్బందులు తొలగాలనేది…
ఏపీ కేబినెట్ వ్యవహారంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ నేతలు కేబినెట్ పై మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి సజ్జల, వైవీ, విజయసాయి రెడ్డిలకు పంచాక బీసీలకు ఎన్ని మంత్రి పదవులిస్తే ఏం లాభం..? అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అధికారం తమ చేతుల్లో పెట్టుకుని బీసీ మంత్రులను కీలు బొమ్మల్లా ఆడిస్తున్నారు. బీసీలను పావులుగా వాడుకునే వైసీపీకు, సముచిత న్యాయం కల్పించిన టీడీపీ నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది.…