ఏపీలో ఇప్పుడంతా కేబినెట్ మార్పుల గురించే చర్చించుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఎన్టీవీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ సీఎం జగన్ ఆలోచన ప్రకారం జరుగుతుంది. సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరూ గౌరవించాల్సిందే అన్నారు. మంత్రివర్గ మార్పులు.. చేర్పులపై ఎవరికీ క్లారిటీ లేదు. సీఎం జగన్ ఏ రోజు చెబితే ఆ రోజు రాజీనామాలు చేసేందుకు మంత్రులందరూ సిద్ధంగా వున్నామన్నారు. సీఎం జగన్ నూతన మంత్రివర్గంలో మంత్రులుగా ఎవరుండాలని నిర్ణయిస్తే వారే ఉంటారు. జనసేన…
ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమయింది. గురువారం కేబినెట్ భేటీ కానుంది. ఇదే చివరి కేబినెట్ భేటీ అంటున్నారు. ఇంతకుముందే మంత్రి పేర్ని నాని కూడా తన మనసులో మాట బయటపెట్టారు. తాను పార్టీ బాధ్యతల్లో వుంటానని, మంత్రిగా తన అధ్యాయం ముగిసిందన్నారు. ఇదిలా వుంటే ఉత్తరాంధ్రకు చెందిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మంత్రివర్గ విస్తరణపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రెండురోజుల క్రితం ఆయన మాజీ సీఎం చంద్రబాబుని పొగిడేశారు. చంద్రబాబు విజ్ఞత…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో రెండేళ్ళపాటు అమాత్య పదవి పొందేందుకు వివిధ జిల్లాల నుంచి పోటీ తీవ్రతరం అయింది. అధికారంలో వుండే ఏ పార్టీకి అయినా ఉభయ గోదావరి జిల్లాలు ఆయువుపట్టు. అక్కడ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీయే అధికారం చేపడుతుంది. ఈ సంప్రదాయం, సెంటిమెంట్ ఎప్పటినుంచో వస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2019 ఎన్నికల్లో రెండుచోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్ధులు…
ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చాలా బిజీగా వుంటారు. జగన్ సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకుని వెళ్ళేందుకు వారు ప్రయత్నిస్తూనే వుంటారు. అందునా, రాబోయే రోజుల్లో మరింత విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వుంటుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు మాత్రం అన్నిటినీ పక్కన పెట్టారు. డ్యాన్స్ తో చిందేశారు. ఓ ప్రైవేట్ పార్టీలో స్నేహితులు, పార్టీ సన్నిహితులతో కలసి చిందులు వేసిన ఎమ్మెల్యే వీడియో వైరల్ అవుతోంది. మంత్రి పదవులు కోసం ఎమ్మెల్యేలు…