Adimulapu Suresh: అమ్మ ఒడిపై ఆంక్షలా? ఆధారాలు చూపండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడిపై ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు తప్పుబడుతున్నారని మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఏపీ ప్రజలు జగన్ శాశ్వత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని నమ్ముతున్నారు. లోకేష్ బాబు ఆయన బాబు చంద్ర బాబు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు.ఎల్లో మీడియా అమ్మ ఒడి పథకంపై నానా తప్పులు రాస్తుందన్నారు. తల్లిరొమ్ము పాలు తాగిన ఏ వ్యక్తి అమ్మ ఒడిని విమర్శించరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం తీసుకువచ్చింది. హైదరాబాద్ లో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు.
అమ్మ ఒడి పథకాన్ని యావత్ భారత దేశం ప్రశంసిస్తుందన్నారు. కుల మాత బేధం లేకుండా పిల్లలను విద్యావంతులను చేయడానికి ఈ పథకాన్ని తీసుకువచ్చాం. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని జగనన్న ఈ పథకాన్ని తీసుకువచ్చారన్నారు మంత్రి సురేష్. రెండు సార్లు అమ్మ ఒడి ద్వారా ఆర్థిక సాయాన్ని అందించాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా కూడా ఇంత గొప్పపథకాన్ని చేపడుతున్నాం. అమ్మ ఒడికి నూతన నిబంధనలు పెడుతున్నాం అని రాస్తున్నారు. అదంతా తప్పు. ఈ పథకం పై నూతన ఆంక్షలు ఏవీ పెట్టడం లేదు. విషం చిమ్మే మాటలను ఎల్లో మీడియా రాస్తుందన్నారు. శానిటైజ్ వర్కర్లకు ఈ పథకం వర్తింపజేస్తున్నాం. అన్ని వర్గాలకు చెందిన 81% మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేశాం. గ్రామ సచివాలయాల్లో లబ్దిదారుల లిస్ట్ ఉంటుంది, పరిశీలించుకోవచ్చన్నారు.
Also Read
జగనన్న ఒక్క బటన్ నొక్కితే లబ్దిదారులకు అన్ని పథకాలు చేరుతున్నాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయి.అమ్మ ఒడి పథకాలపై విషం చిమ్మే మాటలు రాయడం బాధాకరం. కరోనాతో స్కూల్స్ మూతపడినప్పుడు కూడా 70శాతం అటెండెన్స్ లేకున్నా ఆర్థిక సాయం చేసాం. ఎన్నికలు వస్తున్నాయంటే టీడీపీ కుట్రలు చేస్తుంది. చంద్రబాబు అంటే వంచనకు చిహ్నం. జగనన్న చెప్పాడంటే చేస్తాడంతే.
అసత్యాలను వండి వార్చిన కూడా ప్రజలకు మాపై విశ్వాసం ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేస్తాం అన్నారు. అమ్మ ఒడికి బదులుగా ల్యాప్ టాప్స్ కూడా త్వరలో అందిస్తున్నాం. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివే వారికి మరింత సహాయం చేస్తాం. మేము అమ్మ…ఒడిపై ఆంక్షలు పెడుతున్నాం అంటున్న లోకేష్ బాబు, చంద్రబాబు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. కేబినెట్ లో ఉన్న 70శాతం పదవులు బడుగు బలహీన వర్గాల వారికి దక్కాయన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.
తాజావార్తలు
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?