కర్ణాటకలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీని వీడిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ తిరిగి బీజేపీలో చేరారు.
Jagadish Shettar: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. కన్నడ అసెంబ్లీలో 224 స్థానాలు ఉంటే కాంగ్రెస్ 135, బీజేపీ 66, జేడీయూ 19 స్థానాలల్లో విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు బీజేపీ నుంచి పార్టీ మారిన మాజీ సీఎం జగదీష్ షెట్టర్ ఓడిపోయాడు. హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన ఆయనకు ఓటమిని చవిచూశాడు. లింగాయత్ వర్గానికి చెందిన కీలక నేత అయిన షెట్టర్ గెలుపొందకపోవడం చర్చనీయాంశం అయింది.
రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించాలని పిలుపునిచ్చిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం బిఎస్ యడియూరప్పపై జగదీష్ షెట్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఒత్తిడి మేరకు యడియూరప్ప ఈ మాటలు చెబుతున్నారని షెట్టర్ అన్నారు.
'అవినీతి లింగాయత్ ముఖ్యమంత్రి' అంటూ బసవరాజ్ బొమ్మైపై కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారం రేపింది. అయితే, సిద్ధరామయ్య వ్యాఖ్యలను ఇటీవల కాంగ్రెస్ లో చేరిన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేత జగదీశ్ షెట్టార్ సమర్థించారు.
కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య 'అవినీతి రహిత లింగాయత్ ముఖ్యమంత్రి' అంటూ బసవరాజ్ బొమ్మైపై దుమ్మెత్తిపోయడం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు దుమారం రేపింది. ఇది లింగాయత్ ఓట్ల శాతంపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో అనే అంశంపై చర్చ మొదలైంది.
బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ సంచలన వ్యాఖ్యలుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు టికెట్ నిరాకరించినందుకు బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ బీఎల్ సంతోష్‌పై జగదీశ్ శెట్టర్ ఆరోపించారు. అత్యధిక ఓట్లతో గెలిచే అవకాశం ఉన్నప్పుడు తనకు టికెట్ ఎందుకు నిరాకరించారని ఆయన ప్రశ్నించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీ పార్టీలో కల్లోలం మరింత పెరిగింది. ఎన్నికల టికెట్లు దక్కనివారు నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కొత్త ముఖాలకు చొటిచ్చే ప్రయత్నంలో పలువురు సీనియర్లు, సిట్టింగ్ లకు మొండి చేయి చూపడంతో ఒక్కొకరుగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ఈరోజు కాంగ్రెస్‌లో చేరిన కొన్ని గంటల తర్వాత ఆయన తన నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలో జగదీష్ షెట్టర్ సతీమణి శిల్పా భావోద్వేగానికి గురయ్యారు.
Jagadish Shettar: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ టికెట్ నిరాకరించడంతో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్ణాటకలో ప్రముఖ లింగాయత్ నాయకుడు, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2012 నుండి 2013 వరకు రాష్ట్రానికి 15వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య సమక్షంలో…