పన్ను ఎగవేతపై మొదటిసారి సోనూసూద్ స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం బాలీవుడ్ నటుడు సోనూసూద్ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని సోనూసూద్ నివాసం, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. మూడు రోజుల దాడుల తరువాత ఐటి శాఖ సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు, అతని ఫౌండేషన్‌కు సంబంధించి 18 కోట్లు విరాళాలు రాగా, అందులో కేవలం రూ.1.9 కోట్లు కోసం ఖర్చు చేశారని ప్రకటించారు. ఈ విషయం ఆయన ఫాలోవర్స్ ను, అభిమానులను షాక్ కు గురి చేసింది. మరోవైపు సోనూసూద్ గత నాలుగు రోజుల నుంచి సైలెంట్ గా ఉండడం ఆయన అభిమానుల్లో ఆందోళనను పెంచింది.
Read Also : మై హీరో, మై ఇన్స్పిరేషన్… నాగార్జున స్పెషల్ వీడియో
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
తాజాగా సోనూసూద్ తన కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడుల తరువాత మొదటిసారిగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. “మీరు ఎప్పుడూ మీ వైపు జరిగిన కథ చెప్పాల్సిన అవసరం లేదు. సమయమే చెప్తుంది. నేను నా శక్తిమేర ప్రజలకు సేవ చేస్తానని హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేసాను. నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి విలువైన జీవితాన్ని కాపాడటానికి, పేదలకు చేరుకోవడానికి తన వంతు కోసం ఎదురు చూస్తోంది. కొన్ని సందర్భాలలో మానవతాపరమైన కారణాల కోసం నా ఎండార్స్‌మెంట్ ఫీజును విరాళంగా ఇవ్వమని కూడా నేను బ్రాండ్‌లను ప్రోత్సహించాను. నేను కొద్దిమంది అతిథుల దగ్గర బిజీగా ఉన్నాను. కాబట్టి గత 4 రోజులుగా మీ సేవలో ఉండలేకపోయాను. ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి వచ్చాను. మీ వినయపూర్వకమైన సేవలో నా ప్రయాణం కొనసాగుతుంది” అంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు సోనూసూద్. కానీ సోనూ సూద్ ఎక్కడా ఆదాయపు పన్ను దాడులు, రూ. 20 కోట్లకు పైగా పన్ను ఎగవేత గురించి మాట్లాడకపోవడం గమనార్హం.
తాజావార్తలు
-
Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
-
Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!