తెలంగాణలోనే కాదు… ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐటీ, ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి.. మొన్నటికిమొన్న అక్కినేని ఉమెన్ హాస్పిటల్, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రుల్లో ఈ దాడులు కొనసాగిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు విజయవాడలో.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు సాగుతున్నాయి.. ఇవాళ ఉదయం 6.30 గంటల నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.. మొత్తం ఐదు బృందాల అధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.. వైఎస్సార్‌సీపీ నేత అయిన దేవినేని అవినాష్.. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నారు.. ఇవాళ ఉదయం నుంచి విజయవాడ గుణదలలోని ఆయన నివాసంతో పాటూ మరికొన్ని చోట్ల ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, ఏ కేసులో ఈ సోదాలు సాగుతున్నాయి.. ఐదు బృందాలు ఎందుకు రంగంలోకి దిగాయి అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది.. మరోవైపు.. హైదరాబాద్‌లో వంశీ రామ్ బిల్డర్స్ కార్యాలయం, ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్న విషయం విదితమే.. వంశీరామ్ బిల్డర్స్ అధినేత, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలతో పాటు మొత్తం 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Read Also: New Schemes in Telangana: స్పీడ్ పెంచిన కేసీఆర్.. ఎన్నికలకు ముందే మరో పథకం..