Shubhanshu Shukla: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా భారత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) పంపనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇండో-యూఎస్ మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లడానికి అత్యంత పిన్న వయస్కుడైన వ్యక్తిని ఎంపిక చేసింది.
Wayanad Landslide: కేరళ వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 297కి చేరింది. గురువారం వాయనాడ్‌లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన అధికారిక సమావేశంలో, మూడు రోజుల రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రాణాలతో బయటడిన వారందర్ని రక్షించినట్లు అంచనా వేశారు.
Wayanad landslide: ప్రకృతి అందాలకు నెలవైన వయనాడ్ ప్రాంతం ప్రస్తుతం మృతుల దిబ్బను తలపిస్తోంది. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షం కారణంగా వాయనాడ్‌లో మంగళవారం మూడు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలా గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. ప్రజలు చాలా మంది బురద కింద సమాధి అయ్యారు. ఈ ప్రకృతి విపత్తులో 293 మంది చనిపోయారు. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ రెస్కూ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది. ఇప్పటి వరకు 1000…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి వ్యోమగామిని పంపేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి చెందిన గగన్‌యాత్రి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) ప్రయాణిస్తుందని ఆయన తెలియజేశారు.
Ram Setu: భారత్- శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదు.. నిజమే అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (isro) వెల్లడించింది. అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు రిలీజ్ చేశారు.
గోళ అద్భుతాలను చూసేందుకు అందరూ ఇష్టపడతారు. కానీ గ్రహశకలాలు భూమి దగ్గరగా వెళ్లినా, పేలినా అది సృష్టించే వినాశనం ఊహకు అందదు. అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహశకలం ఒకటి మన భూమి వైపు దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. తాజాగా అఫోసిస్ అనే గ్రహశకలం ఉనికిని గుర్తించినట్లు తెలిపారు. దీని పరిమాణం 370 మీటర్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఇండియాకు చెందిన సూర్యన్ ఆదిత్య-ఎల్1 అంతరిక్షంలో మరో చరిత్ర సృష్టించింది. ఆదిత్య ఎల్-1 తన మొదటి హాలో ఆర్బిట్‌ను పూర్తి చేసింది. ఇది ఆదిత్య L1 మొదటి పునరావృతం. 178 రోజుల్లో ఒక రౌండ్ పూర్తయిందని మంగళవారం ఇస్రో ట్వీట్ చేసింది. ఈ రోజు ఆదిత్య-L1 పాయింట్ చుట్టూ తన మొదటి హాలో కక్ష్యను పూర్తి చేసింది. 2024 జనవరి 6న ప్రవేశించిన తర్వాత, ఒక విప్లవాన్ని పూర్తి చేయడానికి 178 రోజులు పట్టింది.
తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో మొదటి ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి అగ్నిబాన్ ప్రైవేటు రాకెట్ నింగికెగిరి చరిత్ర సృష్టించింది. ఈ రోజు ఉదయం 7. 15 గంటలకు విజయవంతంగా షార్ లోని ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు.