Falcon-9 Rocket: భారతదేశం తన అత్యంత అధునాతనమైన బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-20ని ప్రయోగించనుంది. దీనిని GSAT N-2 అని కూడా పిలుస్తారు. వచ్చే వారం దీనిని ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ‘‘ఫాల్కన్ 9’’ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగబోతోంది. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌కి అత్యంత సన్నిహితుడైన ఎలాన్ మస్క్‌కి చెందిన సంస్థతో ఇస్రో భాగస్వామ్యైంది.
ఫాల్కన్ 9 అనేది ‘‘రీ యూజబుల్’’ రాకెట్. ఇప్పటి వరకు దీని ద్వారా 393 ప్రయోగాలు జరిగాయి. ఇందులో కేవలం 4 మాత్రమే విఫలమయ్యాయి. 99 శాతం సక్సెస్ రేట్ కలిగి ఉంది. ఫాల్కన్ 9 ఒక్క ప్రయోగానికి సగటున 70 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ శాటిలైట్ ప్రయోగానికి ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ దురైరాజ్ మాట్లాడుతూ.. ఫాల్కన్ 9 అనేది ఇస్రో టైమ్ ఫ్రేమ్‌కి అందుబాటులో ఉన్న ఏకైక కమర్షియల్ లాంచర్ అని చెప్పారు.
Read Also: Manipur Violence: ఆరుగురి హత్యతో మణిపూర్‌లో హింస.. 7 జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్..
ఫాల్కన్ 9 రాకెట్ పొడవు మొత్తం 70 మీటర్లు. దీని బరువు 549 టన్నులు. ఇది టూ-స్టేజ్ రాకెట్‌గా రూపొందించబడింది. ఇది జియోసింకోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)కి 8,300 కిలోగ్రాముల, లో ఎర్త్ ఆరిట్(LEO)కి 22,800 కిలోగ్రాముల బరువుల్ని మోయగలదు. రాకెట్ మోయాల్సిన జీశాల్ ఎన్-2 బరువు 4700 కిలోలు. ఇది ప్రపంచంలోనే తొలి ఆర్బిట్ – క్లాస్ పునర్వినియోగ రాకెట్. దీని బూస్టర్లు రాకెట్ ప్రయోగం తర్వాత మళ్లీ నేలపై ల్యాండ్ అయ్యేలా రూపొందించబడ్డాయి. తర్వాతి ప్రయోగాలకు మళ్లీ వీటిని ఉపయోగించవచ్చు. ఇది రాకెట్-గ్రేడ్ కిరోసిన్, లిక్విడ్ ఆక్సీజన్‌ని ఇంధనంగా వాడుకుంటుంది.
2021లో, ఫాల్కన్ 9 ఒకే మిషన్‌లో 143 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పింది, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క ఒకే మిషన్‌లో 104 ఉపగ్రహాలను ప్రయోగించిన భారతదేశం యొక్క 2017 రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఏడాది స్పెస్ ఎక్స్ ఇప్పటికే ఫాల్కన్ ద్వారా 106 లాంచ్‌లను నిర్వహించింది. ఇదే ఫాల్కన్ 9 రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి కార్గో, వ్యోమగాములను తీసుకెళ్తుంది.
Tracking footage of Falcon 9 first stage returning to Earth after launching the Ax-2 mission to orbit pic.twitter.com/fLPQ7OhJOg
— SpaceX (@SpaceX) June 3, 2023