First Analog Space Mission: ఇస్రో (ISRO) తన మొదటి అనలాగ్ స్పేస్ మిషన్‌ను గురువారం నాడు లేహ్‌లో ప్రారంభించింది. ఇందుకు సంబంధించి.. శుక్రవారం నాడు ఆ మిషన్‌కు సంబంధించిన చిత్రాలను పంచుకోవడం ద్వారా ఇస్రో ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఈ మిషన్ భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాలలో ఒక మైలురాయిగా నిరూపించబడుతుంది. భవిష్యత్తులో వ్యోమగాములు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడానికి, అలాగే భూమి బయట విశ్వంలో జీవం కోసం అన్వేషించడం ఈ మిషన్ ముఖ్య లక్ష్యం. మానవ అంతరిక్షయానం, ఇతర గ్రహ అన్వేషణలో తన సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. త్వరలో అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు సిద్ధమవుతున్న గగన్‌యాన్ కార్యక్రమం కూడా ఇందులో ఉంది.
Also Read: Pawan Kalyan: జగన్నాధపురంలో దీపం పథకం ప్రారంభించిన డిప్యూటీ సీఎం..
అనలాగ్ స్పేస్ మిషన్ సమయంలో, అంతరిక్షంలోకి వెళ్లే ముందు భూమిపై అంతరిక్షం వంటి క్లిష్ట పరిస్థితుల్లో వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు ఈ మిషన్ రూపొందించబడింది. దీనిలో మొత్తం వాతావరణం స్పేస్ లో ఉండే విధంగా ఉంటుంది. అనలాగ్ స్పేస్ మిషన్ అనేది భూమిపై అంతరిక్షం లాంటి పరిస్థితులు సృష్టించబడిన సాంకేతికత. దీని ద్వారా వ్యోమగాములు ఈ సవాళ్లను ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ మిషన్‌లో ఇస్రో చంద్రుడు, అంగారకుడి ఉపరితలంతో సమానమైన వాతావరణాన్ని ఉంచేలా ఏర్పాట్లు చేసింది. ఇక్కడ వ్యోమగాములు పరిమిత వనరులతో జీవిస్తారు. ఈ అనలాగ్ స్పేస్ మిషన్.. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, ఇస్రో, ఆక (AAKA) స్పేస్ స్టూడియో, లడఖ్ విశ్వవిద్యాలయం, IIT బాంబే సహకారంతో తయారు చేసారు. దీనికి లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ నుండి మద్దతు లభించింది.
🚀 India’s first analog space mission kicks off in Leh! 🇮🇳✨ A collaborative effort by Human Spaceflight Centre, ISRO, AAKA Space Studio, University of Ladakh, IIT Bombay, and supported by Ladakh Autonomous Hill Development Council, this mission will simulate life in an… pic.twitter.com/LoDTHzWNq8
— ISRO (@isro) November 1, 2024