Shubhanshu Shukla: రోదసిలోకి దూసుకెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా
- రోదసిలోకి దూసుకెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా
- 14 రోజుల పాటు పరిశోధనలు చేయనున్న శుభాంశు శుక్లా బృందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు రోదసి యాత్ర ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. ఇస్రో, నాసా యాక్సియం-4 మిషన్ ప్రయోగం చేపట్టింది. గురువారం సాయంత్రం 4.30 గంటలకు అంతరిక్ష కేంద్రంతో డ్రాగన్ వ్యోమనౌక డాకింగ్ ప్రక్రియ అనుసంధానం అవుతుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చేరుకునేందుకు 28 గంటల ప్రయాణం సాగనుంది. 14 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌లో శుభాంశు శుక్లా గడపనున్నారు. శుభాంశు శుక్లా రోదసి యాత్ర కోసం భారత్ రూ.550 కోట్లు ఖర్చు చేస్తోంది. శుభాంశు శుక్లా.. యాక్సియం-4 మిషన్‌కు పైలట్‌గా వ్యవహరిస్తున్నాడు.

Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
రోదసిలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డ్ సృష్టించబోతున్నాడు. 1984లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లాడు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఆ రికార్డ్‌ను 39 ఏళ్ల శుభాంశు శుక్లా తిరగ రాస్తున్నాడు. అమెరికా, పోలాండ్, హంగేరీకి చెందిన ముగ్గురు వ్యోమగాములతో కలిసి శుభాంశు శుక్లా రోదసిలోకి వెళ్లాడు. 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్ర మండలానికి వెళ్లింది ఈ ప్రదేశం నుంచి కావడం విశేషం. 39 ఏళ్ల శుభాంశు శుక్లాను ఫైటర్ పైలట్‌గా ఇస్రో ప్రధాన వ్యోమగామిగా ఎంపిక చేసింది. నలుగురు సభ్యుల బృందం 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు.

వాతావరణం, సాంకేతిక కారణాలతో ఆక్సియం-4 మిషన్ ప్రయోగం ఆరుసార్లు వాయిదా పడింది. ఇన్నాళ్లకు ఆక్సియం-4 మిషన్ ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి ఫాల్కన్-9 ఎగిరింది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్‌ను నిర్వహిస్తోంది. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: UP: నన్ను తాకితే 35 ముక్కలు చేస్తా.. తొలి రాత్రి నవ వధువు హల్‌చల్.. ఆలస్యంగా వెలుగులోకి..!
యాక్సియం-4 మిషన్ ప్రయోగం.. మొదట మే 29న ప్రయోగించాల్సి ఉండగా సాంకేతిక, వాతావరణ కారణాలతో జూన్ 8కి వాయిదా పడింది. తిరిగి జూన్ 10, జూన్ 11, జూన్ 12కి వాయిదా పడింది. స్పేష్ ఎక్స్ అంతరిక్ష నౌకలో లీక్ కారణంగా ప్రయోగం తిరిగి జూన్ 19కి వాయిదా పడింది. మళ్లీ అనివార్య కారణాల చేత జూన్ 22కి వాయిదా పడింది. తిరిగి ఇన్ని రోజులకు జూన్ 25న యాత్ర ప్రారంభం అయింది. యాత్ర సక్సెస్ కావాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. ఇక భారత వ్యోమగామి శుభాంశుకి భారతీయులు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Dragon has separated from Falcon 9’s second stage pic.twitter.com/YXIvBoSOn0
— SpaceX (@SpaceX) June 25, 2025
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..