భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బుధవారం అంతరిక్షంలోకి వెళ్తున్నారు. రోదసిలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డ్ సృష్టించబోతున్నాడు. 1984లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లాడు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఆ రికార్డ్‌ను 39 ఏళ్ల శుభాంశు శుక్లా తిరగ రాస్తున్నాడు. అమెరికా, పోలాండ్, హంగేరీకి చెందిన ముగ్గురు వ్యోమగాములతో కలిసి శుభాంశు శుక్లా రోదసియాత్ర చేపట్టనున్నాడు. బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు యాక్సియం-4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుందని నాసా ప్రకటించింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నట్లు వెల్లడించింది. 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్ర మండలానికి వెళ్లింది ఈ ప్రదేశం నుంచి కావడం విశేషం. 39 ఏళ్ల శుభాంశు శుక్లాను ఫైటర్ పైలట్‌గా ఇస్రో ప్రధాన వ్యోమగామిగా ఎంపిక చేసింది. నలుగురు సభ్యుల బృందం 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు.
వాతావరణం, సాంకేతిక కారణాలతో ఆక్సియం-4 మిషన్ ప్రయోగం ఆరుసార్లు వాయిదా పడింది. ఇన్నాళ్లకు ఆక్సియం-4 మిషన్ ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి ఎగరనుంది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్‌ను నిర్వహిస్తోంది. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళుతోంది. 28 గంటల తర్వాత వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం 14 రోజుల పాటు అక్కడే ఉండి పరిశోధనలు చేస్తారు.
ఇది కూడా చదవండి: Coolie : ఆల్ టైమ్ రికార్డ్ ధరకు ‘కూలీ’ తెలుగు రైట్స్..
యాక్సియం-4 మిషన్ ప్రయోగం.. మొదట మే 29న ప్రయోగించాల్సి ఉండగా సాంకేతిక, వాతావరణ కారణాలతో జూన్ 8కి వాయిదా పడింది. తిరిగి జూన్ 10, జూన్ 11, జూన్ 12కి వాయిదా పడింది. స్పేష్ ఎక్స్ అంతరిక్ష నౌకలో లీక్ కారణంగా ప్రయోగం తిరిగి జూన్ 19కి వాయిదా పడింది. మళ్లీ అనివార్య కారణాల చేత జూన్ 22కి వాయిదా పడింది. తిరిగి ఇన్ని రోజులకు జూన్ 25న యాత్ర ప్రారంభం అవుతోంది. యాత్ర సక్సెస్ కావాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. ఇక భారత వ్యోమగామి శుభాంశుకి భారతీయులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ENG vs IND: ఒక్క టెస్టులో 5 సెంచరీలు.. కానీ ఏం లాభం..?