Israel: భారతీయులకు కలిసి వస్తున్న ఇజ్రాయిల్-గాజా యుద్ధం.. లక్ష మందికి పని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి 1400 మందిని దారుణంగా ఊచకోత కోశారు. మరో 200 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ సైన్యం భీకరంగా దాడులు చేస్తోంది. వైమానిక దాడులతో పాటు భూతల దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజాను పూర్తిగా దిగ్బంధించింది. మరోవైపు ఇజ్రాయిల్ లో ఉన్న పాలస్తీనియన్లను పంపించేంది.
Read Also: Uttar Pradesh: పెళ్లికి నిరాకరించిన వితంతువు.. నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భారతీయులకు కలిసి వస్తోంది. ముఖ్యంగా పాలస్తీనియన్లను పూర్తిగా ఇజ్రాయిల్ నుంచి పంపించేయడంతో కార్మికుల కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఏర్పడిన కార్మికులు, ఉద్యోగాలను భారతీయులతో భర్తీ చేయాలని ఇజ్రాయిల్ భావిస్తోంది. వాయిస్ ఆఫ్ అమెరికా నివేదిక ప్రకారం.. 90,000 మంది పాలస్తీనియన్ల స్థానంలో లక్ష మంది భారతీయ కార్మికునలు నియమించుకోవడానికి అనుమతించాలని పలు ఇజ్రాయిల్ నిర్మాణ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విషయంలో తాము భారత్ తో చర్యలు జరుపుతున్నామని, తదుపరి ఆమోదం కోసం ఇజ్రాయిల్ అధికారుల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని ఇజ్రాయిల్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. దేశంలో పనిచేయడానికి, సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇండియా నుంచి 50,000 నుంచి లక్ష మంది కార్మికులు అవసరం అవుతారని అంచనా వేస్తున్నారు. పాలస్తీనా కార్మికులు వెళ్లడంతో ముఖ్యంగా నిర్మాణ రంగం తీవ్రంగా ప్రభావితమైంది.
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధానికి నెల రోజులు పూర్తయ్యాయి. హమాస్‌ని పూర్తిగా నేలమట్టం చేసేదాకా తాము విశ్రమించబోమని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ అమెరికాతో పాటు ఏ దేశం చెప్పిన వినే పరిస్థితిలో లేదు. గాజా స్ట్రిప్, ముఖ్యంగా ఉత్తర గాజాలోని హమాస్ స్థావరాలను నెలమట్టం చేస్తోంది. ఇప్పటికే గాజాలో కీలకంగా ఉన్న హమాస్ ఉగ్రవాదుల్లో చాలా మందిని చంపేసింది. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 10 వేల మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు.
తాజావార్తలు
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!