మాల్దీవులు ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాలస్తీనాకు మద్దతుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సాకారం చేసేందుకు హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప దేశం చట్టపరమైన సవరణలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి రాకుండా ఆ దేశ మంత్రిమండలి ఆదివారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
Saudi Arabia: 2023-24 విద్యాసంవత్సరానికి గానూ సౌదీ అరేబియా స్కూల్ బుక్స్ మ్యాపుల నుంచి పాలస్తీనా పేరును తొలగించారని వస్తున్న నివేదికలు చర్చనీయాంశంగా మారాయి.
OpenAI: రేపటితో భారత్‌లో సార్వత్రిక ఎన్నికలకు తెరపడబోతోంది. మరో నాలుగు రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. తాజాగా ఓ బాంబులాంటి వార్త బయటకు వచ్చింది. భారతదేశ ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు, యాంటీ-బీజేపీ ఎజెండాతో కృత్రిమమేథ(AI)ని ఉపయోగించేందుకు ఇజ్రాయిల్‌కి చెందిన ఓ సంస్థ ప్రయత్నించిందని ఓపెన్ఏఐ(OpenAI) నివేదిక పేర్కొంది.
Israel:బందీలను అప్పగించే వరకు ఎలాంటి ఒప్పందం లేదన ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. యుద్ధం నిలిపేస్తే చర్చలకు సిద్ధమని హమాస్ ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయిల్ ఈ వ్యాఖ్యలు చేసింది. బందీలను అప్పగించడం ఒప్పందంలో భాగం కాకుంటే గాజాలో పోరాటాన్ని ఆపేది లేని శుక్రవారం ఇజ్రాయిల్ సీనియర్ భద్రతా అధికారి చెప్పారు.
All Eyes On Rafah: ఇజ్రాయిల్-గాజా మధ్య యుద్ధ తీవ్రత మరింత పెరిగింది. ఇటీవల దక్షిణ గాజాలోని రఫా నగరంలో ఇజ్రాయిల్ జరిపిన దాడిలో శరణార్థి శిబిరంలోని చిన్నారులతో పాటు కనీసం 45 మంది మరణించారు.
Israel Strike On Rafah: గాజా స్ట్రిప్‌లోని రఫాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇప్పటికే గాజా నగరంపై దాడి చేసిన ఇజ్రాయిల్, హమాస్ నాయకులుకు రక్షణగా నిలుస్తుందంటూ రఫాపై దాడి చేస్తోంది.
Israel-Hamas War: హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై భారీగా మిస్సైల్ దాడికి పాల్పడ్డారు. హమాస్ సాయుధ విభాగం అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ ఆదివారం ఇజ్రాయిల్ వాణిజ్య రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా క్షిపణి దాడి ప్రారంభించింది.
అజిత్ దోవల్ పేరును అందరికీ సుపరిచితమే. 2014 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక అనుభవజ్ఞులు, నాయకులు కూడా భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుగా అతడిని ప్రశంసించడం ప్రారంభించారు. తాజాగా ఓ కార్యక్రమంలో అజిత్ దోవల్ ఇజ్రాయెల్ పై ప్రశంసలు కురిపించారు.