పాలస్తీనా అనుకూల నిరసనలతో ఇటలీ అట్టుడుకింది. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నిరాకరించారు. ఓ వైపు పాలస్తీనా రాజ్యం ఏర్పాటుకు ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ మద్దతు తెల్పుతుండగా ఇటలీ మాత్రం అందుకు నిరాకరించింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్ గాజాపై దాడిని తీవ్రతరం చేసింది. గాజాలో భూతల దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో హమాస్ తమ వద్ద ఉన్న 48 మంది ఇజ్రాయిలీ బందీలకు తుది ‘‘వీడ్కోలు’’ అంటూ ఒక చిత్రాన్ని విడుదల చేసింది. ఇందులో జీవించి ఉన్న, చనిపోయి ఉన్నవారి ఫోటోలను ఆన్లైన్లో విడుదల చేసింది. ప్రతీ ఒక్కరిని ‘‘రాన్ అరాద్’’గా అభివర్ణించింది. రాన్ అరాద్ అనే పేరు 1986లో అదృశ్యమైన ఇజ్రాయిల్ వాయుసేన అధికారిని గుర్తు చేస్తోంది. ఆయన అదృశ్యం…
ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ తీరును తప్పుపట్టాయి. అయితే ఈ దాడులతో తనకెలాంటి సంబంధం లేదని ట్రంప్ ప్రకటించారు. తనకు తెలియకుండానే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిందని చెప్పుకొచ్చారు.
Arab-Islamic Summit: ఇటీవల హమాస్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ఖతార్ రాజధాని దోహాపై విరుచుకుపడింది. హమాస్ నేతలు సమావేశమైనట్లు భావిస్తున్న భవనంపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ పరిణామాలను అసలు ఖతార్ ఊహించలేదు. ఈ దాడుల్ని పిరికిదాడులుగా అభివర్ణించింది. ఈ దాడులు, గాజాలో ఇజ్రాయిల్ దాడుల తీవ్రత పెంచిన తర్వాత అరబ్-ఇస్లామిక్ నేతల సమాశానికి దోహా వేదికైంది. ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన ఇస్లామిక్ దేశాల అధినేతలు ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా పెద్ద పెద్ద కామెంట్స్…
ఖతార్‌లో హమాస్ నాయకులే లక్ష్యంగా గత వారం మెరుపు వేగంతో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. వైమానిక, డ్రోన్లతో విరుచుకుపడింది. దోహాలో నివాస సముదాయాల్లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
గాజా స్వాధీనం.. బందీలను రక్షించడం లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజా దాడుల్లో ఇప్పటి వరకు 41 మంది మృతి చెందగా.. పదుల కొద్ది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మొస్సాద్.. ఇజ్రాయెల్ అత్యంత శక్తివంతమైన నిఘా వ్యవస్థ. గురి పెట్టిందంటే పని కావాల్సిందే. అంత పగడ్బందీగా పని చేయగల సామర్థ్యం మొస్సాద్ సొంతం. అలాంటిది మొట్టమొదటిసారిగా ఖతార్‌లో విఫలమైంది. దీనికి అంతర్గత విభేదాలే కారణంగా ది వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఇకపై పాలస్తీనా దేశంగా ఉండబోదని ప్రతిజ్ఞ చేశారు. ఖతార్‌లో హమాస్ నాయకుల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి తర్వాత అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
గాజాలో మానవతాసాయం అందించేందుకు 44 దేశాల పౌరులను తీసుకెళ్తున్న గ్రెటా థన్‌బర్గ్ నౌక్‌పై డ్రోన్ దాడి జరిగింది. ట్యునీషియా దగ్గర ఈ దాడి జరిగింది. పోర్చుగీస్ జెండా కలిగిన గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా నౌక అనుమానిత దాడిలో దెబ్బతిన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని హమాస్‌తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ తెలిపారు. శుక్రవారం ఓవర్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతూ.. గాజాలో బందీలుగా ఉన్న వారిని విడుదల చేయాలని హమాస్‌తో చాలా లోతైన చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు