అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. మరోసారి దాడి జరిగితే భారీ స్థాయిలో ఎదురుదాడి జరగడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు.
ఇజ్రాయెల్‌లో నెతన్యాహు ప్రభుత్వానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లును ప్రధాన మిత్రపక్షం తీవ్రంగా వ్యతిరేకించింది.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినా కూడా గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగలేదు. తాజాగా ఆదివారం కూడా ఐడీఎఫ్ దాడులు చేసింది.
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ హత్యకు ఇజ్రాయెల్ కుట్ర పన్నిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనుబంధ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ఆదివారం నివేదించింది. జూన్ 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది.
గాజాపై ఇంకా యుద్ధం ముగియలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలో అమెరికా స్పీకర్‌తో సమావేశం తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విలేకరులతో మాట్లాడారు. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్న లక్ష్యా్న్ని ఇజ్రాయెల్ పూర్తి చేస్తుందని తెలిపారు.
గాజా-ఇజ్రాయెల్ మధ్య 60 రోజులు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయినా కూడా గాజాపై దాడులు ఆగడం లేదు. ఇంకోవైపు హమాస్‌ను అంతం చేసేదాకా వదిలిపెట్టబోమని నెతన్యాహు హెచ్చరిస్తున్నారు.
గాజాతో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు చేశాయి. ప్రాముఖ్యంగా ఫార్డో అణు కేంద్రాన్ని బీ-2 బాంబర్లు ధ్వంసం చేశాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నారు.
ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా బాంబులు దూసుకుపోయాయని తాజాగా డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును దేవుని శత్రువులుగా పరిగణిస్తూ ఇరాన్‌లోని ప్రముఖ షియా మతాధికారి అయతుల్లా నాజర్ కమరెం షిరాజీ ఫత్వా జారీ చేశారు. వీరికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా వీరిద్దరికి ఏ ముస్లిం నాయకులు కూడా మద్దతు ఇవ్వొద్దని ఫత్వాలో పేర్కొన్నారు.