ఈజిప్టు వేదికగా గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. సోమవారం షర్మ్ ఎల్ షేక్‌లో అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సీసీ ఆధ్వర్యంలో శాంతి శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంయుక్తంగా ఆహ్వానించారు.
దాదాపు రెండేళ్ల తర్వాత హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా సోమవారం మూడు విడతలుగా బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలి విడతగా ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది.
ఒక్కరోజు కాదు.. రెండ్రోజులు కాదు. ఏకంగా రెండేళ్లు చెరలో బందీలుగా ఉండిపోయారు. ఏదో రోజు తిరిగి వస్తారని ఎదురుచూసిన ఎదురుచూపులకు నిరీక్షణ ఫలించింది. సోమవారం తొలి విడత బందీలను హమాస్ విడుదల చేసింది. దీంతో ఇజ్రాయెల్ అంతటా పండుగ వాతావరణం నెలకొంది.
గాజాలో పాలన పాలస్తీనీయుల చేతుల్లోనే ఉండాలని హమాస్, పాలస్తీనా వర్గాలు కీలక ప్రకటన విడుదల చేశాయి. ఏదైనా బాహ్య జోక్యాన్ని గానీ విదేశీయుల ఆదిపత్యాన్ని గానీ అంగీకరించబోమని పేర్కొంది.
ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన తొలి రౌండ్ పరోక్ష చర్చలు సానుకూల వాతావరణంలో ముగిసినట్లుగా తెలుస్తోంది. గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు.
అక్టోబర్ 7, 2023 ఎవరూ మరిచిపోలేని రోజు. ప్రపంచమంతా ఉలిక్కిపడ్డ రోజు. హమాస్ ముష్కరులు ఊహించని రీతిలో ఇజ్రాయెల్‌లోకి చొరబడి 1,200 మందిని చంపి దాదాపు 251 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన ఇజ్రాయెల్‌నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది.
గాజాలో ఇంకా యుద్ధం ముగియలేదని.. బందీలను బయటకు తీసుకురావడమే తన తొలి ప్రాధాన్యత అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడారు. ట్రంప్ ప్రణాళికకు, బందీలను విడుదల చేయడానికి హమాస్ ప్రాథమికంగా అంగీకరించిందని.
గాజాలో అధికారాన్ని విడిచిపెట్టకపోతే పూర్తిగా నిర్మూలం అవుతారని హమాస్‌ను మరోసారి ట్రంప్ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే నరకం చూస్తారని హమాస్‌ను ఇటీవల ట్రంప్ హెచ్చరించారు. దీంతో శుక్రవారం రాత్రి ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలకు అంగీకారం తెల్పుతున్నట్లు హమాస్ ప్రకటించింది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందానికి త్వరగా అంగీకరించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఒప్పందానికి మరింత ఆలస్యమైతే, ఇంకా విధ్వంసం జరగొచ్చని అన్నారు. హమాస్ తక్షణమే స్పందించాలని, లేకపోతే అన్నీ మారిపోతాయని, ఆలస్యం అంగీకారమవ్వదని, గాజా మళ్లీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.