అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా ట్రంప్‌నకు శాంతి బహుమతి ఇవ్వాలని నెతన్యాహు మద్దతు కూడా ఇచ్చారు.
ఇజ్రాయెల్ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గాజాను స్వాధీనం చేసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో గాజాపై మరింత పోరాటానికి ఇజ్రాయెల్ సిద్ధపడినట్లైంది.
గాజాలో కాల్పులు ఆపకపోతే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇప్పటికే హెచ్చరించారు. తాజాగా ఆ జాబితాలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ కూడా చేశారు.
పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అంటుంటే.. హమాస్‌ను అంతం చేయాల్సిందేనని ట్రంప్ సూచించారు. హమాస్‌ను అంతం చేయాలని.. గాజాలో ఆ పనిని పూర్తి చేయాలని తాజాగా ఇజ్రాయెల్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.
Israel: ఇజ్రాయిల్ సైన్యంలో అన్ని రక్షణ దళాలు, ఇంటెలిజెన్స్‌లోని సైనికులు, అధికారులు ఇస్లాం గురించి అధ్యయనం చేయడం, అరబిక్ భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేసింది. అక్టోబర్ 07, 2023 నాటి నిఘా వైఫల్యం తర్వాత, మరోసారి అలాంటి దాడి జరుగొద్దని భావిస్తున్న ఇజ్రాయిల్ ఈ నిర్ణయం తీసుకుంది.
అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. మరోసారి దాడి జరిగితే భారీ స్థాయిలో ఎదురుదాడి జరగడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు.
ఇజ్రాయెల్‌లో నెతన్యాహు ప్రభుత్వానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లును ప్రధాన మిత్రపక్షం తీవ్రంగా వ్యతిరేకించింది.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినా కూడా గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగలేదు. తాజాగా ఆదివారం కూడా ఐడీఎఫ్ దాడులు చేసింది.