Indian Army: మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మధ్య ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో, UN శాంతి పరిరక్షక దళంలో భాగంగా ఇజ్రాయెల్ – లెబనాన్ దేశాల సరిహద్దులో మోహరించిన భారత సైన్యం అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. లెబనాన్‌లో ఇటీవల జరిగిన పేజర్ పేలుడు హిజ్బుల్లా, ఇజ్రాయెల్ లను యుద్ధం అంచున ఉంచింది. కాగా, శాంతిభద్రతల పరిరక్షణలో భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తోంది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్ కింద భారత సైన్యం సమస్యాత్మక…
హిజ్బుల్లా లక్ష్యంగా సోమవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 28 చిన్నారుల సహా 558 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలు పాలయ్యారు.
Al Jazeera: ఖతార్‌కి చెందిన ప్రముక మీడియా సంస్థ ‘‘అల్ జజీరా’’కి ఇజ్రాయిల్ షాక్ ఇచ్చింది. వెస్ట్ బ్యాంక్‌లోని రమల్లాలో అల్ జజీరా కార్యాలయానికి వెళ్లిన ఇజ్రాయిల్ ఆర్మీ వెంటనే వారిని ఖాళీ చేయాలని ఆదేశించింది. భా
NTV Special Story Israel’s Unit 8200 in Lebanon Explosions: మూడు రోజులుగా పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. లెబనాన్ లోని హెజ్బొల్లా తీవ్రవాదుల పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చేసిందనే అనుమానాలు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. తాజాగా హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ నేరుగా విరుచుకుపడుతోంది. ఆ సంస్థ స్థావరాలపై రాకెట్లతో దాడులు చేస్తోంది. దీంతో ఇది యుద్ధమేనంటోంది లెబనాన్. అసలు హెజ్బొల్లా పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ ఎలా పసిగట్టింది.. వాటిని ఎలా పేల్చేసింది..? పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో…
Hezbollah: హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా ఇజ్రాయిల్ లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. ఇప్పటికే పేజర్లు, వాకీ-టాకీల పేలుళ్లతో షాక్‌లో ఉన్న హిజ్బుల్లాని చావుదెబ్బ తీస్తోంది. ఇప్పటికే పేజర్ల పేలుళ్లలో 37 మంది ఆ సంస్థ మద్దతుదారులతో పాటు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. 3000 మంది ఈ పేలుళ్ల కారణంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే శుక్రవారం హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో 8 మంది మరణించారని, డజన్ల సంఖ్యలో గాయపడ్డారని తెలుస్తోంది.
బీరుట్ సబర్బన్ ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడిలో 8 మంది చనిపోయారు.. 59 మంది గాయపడినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఓ అగ్ర సైనికుడు ఉన్నాడు. కాగా.. ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే..
Yahya Ayyash: యాహ్య అయ్యాష్, హమాస్ ఉగ్రసంస్థలో బాంబు తయారీలో నేర్పరి. అందుకే ఇతడిని అందరూ ముద్దుగా ‘‘ది ఇంజనీర్’’గా పిలుచుకునే వారు. ఇతడికి ప్రత్యేకం పెద్ద అభిమాన వర్గమే ఉండేది. ఇతడు తయారు చేసిన బాంబుల్ని చుట్టుకుని ఆత్మాహుతి దాడుల్లో మరణించడం గౌరవంగా భావించేవారంటే అతిశయోక్తి కాదు.
Israel: హిజ్బుల్లా మిలిటెంట్లను ఇజ్రాయిల్ చావు దెబ్బ తీసింది. ఎక్కడ మొబైల్ ఫోన్లు, శాటిలైట్ ఫోన్లు ఉపయోగిస్తే ఇజ్రాయిల్ కనిపెట్టేస్తోందనే భయంతో అవుట్ డేటెడ్ కమ్యూనికేషన్ పరికరం ‘‘పేజర్’’లను హిజ్బుల్లా మిలిటెంట్లు వాడుతున్నారు.
Hezbollah: లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దాడితో తమ హిజ్బుల్లా గ్రూప్ ‘‘అపూర్వమైన’’ దెబ్బకు గురైందని, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా చివరకు అంగీకరించారు.