Israel-Iran War: ప్రతీకారానికి సన్నద్ధం.. ఇరాన్ అణుకేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సన్నాహాలు!
- ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం
- దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ హెచ్చరిక
- ఇరాన్ అణు కేంద్రాలు లక్ష్యాలుగా మారవచ్చని ఊహాగానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మంగళవారం క్షిపణుల వర్షం కురిపించింది. దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. ఇరాన్ దాడుల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ దాడుల్లో ఒకరు మరణించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడుల తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ బెదిరించింది. ఇరాన్ పాలన ప్రపంచ శాంతికి ముప్పు అని పేర్కొంది. ఇరాన్ అణు కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇరాన్ అణు లేదా చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యక్ష ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. దాడి వల్ల పెద్దగా నష్టం జరగనప్పటికీ, దాడికి ప్రతిస్పందిస్తామని ఇజ్రాయెల్ అధికారులు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇరాన్ యొక్క అణు కేంద్రాలు దాని లక్ష్యం కావచ్చని ఇజ్రాయెల్ ప్రతిచర్య సూచిస్తుంది.
Read Also: Swachh Bharat: స్వచ్ఛ భారత్ మిషన్‌కు పదేళ్లు పూర్తి.. పిల్లలతో కలిసి చీపురు పట్టిన ప్రధాని
Also Read
ఇరాన్ క్షిపణి దాడికి గట్టిగా ప్రతిస్పందిస్తామని ఇజ్రాయెల్ సీనియర్ అధికారులు ప్రతిజ్ఞ చేశారు. దీనిపై సీరియస్ రియాక్షన్ ఉంటుందని రక్షణ అధికారి ఒకరు తెలిపారు. ఇరాన్ ఇప్పటివరకు అనుభవించినది చాలా తక్కువ అని మరో ఇజ్రాయెల్ అధికారి హెచ్చరించారు. ఇరాన్ భవిష్యత్తులో చాలా భరించవలసి ఉంటుందన్నారు. ఇప్పుడు ఇరాన్‌పై పెద్ద దాడి చేస్తామని ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నారు. ఇరాన్ తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకున్న క్షిపణులు విఫలమయ్యాయని, అయితే ఇరాన్ దాడి చేయడం ద్వారా తీవ్రమైన తప్పు చేసిందని, దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. దాడి చేసే వారిపైనే ఎదురు దాడి జరుగుతుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!