Benjamin Netanyahu: ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ రోజు ఉదయం ఇజ్రాయిల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లపై వైమానిక దాడితో విరుచుకుపడింది. మరోవైపు హిజ్బుల్లా కూడా ఇజ్రాయిల్ ఉత్తర భాగంపై రాకెట్లు , డ్రోన్లతో దాడులు చేసింది. అయితే, హిజ్బుల్లా దాడుల్ని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన దాడి చివరిది కాదని ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహూ లెబనాన్, హిజ్బుల్లాను హెచ్చరించారు.
Israel Army Attack : హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత దాదాపు యుద్ధ రూపాన్ని సంతరించుకుంది. లెబనాన్ సరిహద్దుకు ఇరువైపులా వైమానిక దాడులు జరుగుతున్నాయి.
Israel Gaza War : దక్షిణ గాజా స్ట్రిప్‌లో అనేక ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 36 మంది పాలస్తీనియన్లు మరణించారు. శనివారం ఉదయం ఖాన్ యూనిస్ నగరంలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇద్దరు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన
రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ మొదటగా పోలాండ్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో.. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్యనైనా యుద్ధభూమిలో కాకుండా సంభాషణలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఉక్రెయిన్ మరియు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు మనందరికీ తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. యుద్ధభూమిలో ఏ సమస్యకూ పరిష్కారం లభించదని భారత్ దృఢంగా విశ్వసిస్తోందని మోడీ చెప్పారు.
Hezbollah: గత నెలలో హిజ్బుల్లా సీనియర్ కమాండర్, కీలక నేత ఫువాద్ షుక్ర్ని ఇజ్రాయిల్ వైమానిక దాడిలో హతమార్చింది. అయితే, ఈ ఆపరేషన్ కోసం ఇజ్రాయిల్ షుక్ర్కి తెలివిగా ఉచ్చు బిగించింది. లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న షుక్ర్ని ‘‘ టెలిఫోన్ కాల్’’ మట్టుపెట్టేలా చేసింది. నిజానికి హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థని రాకెట్ ఫోర్స్‌గా తీర్చిదిద్దిన ఘటన ఇతనికే చెల్లుతుంది. అయితే, అతడి గుర్తింపును మా
10 నెలల యుద్ధం తర్వాత ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తుల చర్చలు అసంపూర్తిగా ముగిసిన వేళ గాజాపై మరోసారి భీకర దాడులు జరిగాయి. జవైదా పట్టణంపై టెల్అవీవ్ జరిపిన వైమానిక దాడిలో 18 మంది మృతి చెందారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. దాడిలో వ్యాపారి అయిన సమీ జవాద్ అల్-ఎజ్లా, అతడి ఇద్దరు భార్యలు, 11 మంది పిల్లలు, మరో నలుగురు బంధువులు ప్రాణాలు కోల్పోయినట్లు అల్-అక్సా…
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నెతన్యాహు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Hamas Targets Israel: హమాస్‌కి చెందిన సాయుధ విభాగం ఆల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ మంగళవారం ఇజ్రాయిల్ వాణిజ్య నగరం టెల్ అవీవ్‌పై దాడి చేసింది. "M90" రాకెట్లతో నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేసింది.
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్ అగ్ర నేత హనియే హత్య తర్వాత పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులకు దిగింది. M90 రాకెట్స్‌ను ప్రయోగించింది.