Bomb Blast: ఆగి ఉన్న మూడు బస్సులలో వరుస పేలుళ్లు సంభవించడంతో సెంట్రల్ ఇజ్రాయెల్ దద్దరిల్లింది. ఇది ఉగ్రవాద దాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరూ గాయపడినట్లు, మరణించినట్లుగాను నివేదిక లేదు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ గాజా నుండి నలుగురు బందీల మృతదేహాలను తిరిగి ఇచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఇవే కాకుండా మరో రెండు బస్సుల్లో పేలుడు పదార్థాలు దొరికాయని, కానీ.. అవి పేలలేదని…
లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో హమాస్ ఆపరేషన్స్ అధిపతి ముహమ్మద్ షాహీన్ హతమయ్యాడు. షాహీన్.. ఇరాన్ డైరెక్షన్, నిధులతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా ఐడీఎఫ్ గుర్తించింది.
శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపు ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయాలని హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. లేకుంటే నరకం చూస్తారని వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్‌కు ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఇజ్రాయెల్ బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని హమాస్‌కు ట్రంప్ అల్టిమేటం విధించారు.
పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండం అయ్యేలా కనిపిస్తోంది. ఏడాదికి పైగా ఇజ్రాయెల్ చేసిన దాడులతో గాజా నేలమట్టం అయింది. వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హమాస్-లెబనాన్-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గాజాపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ ఇటీవల చేసిన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.
Donald Trump: ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు సంచలన ప్రకటన విడుదల చేశారు. యుద్ధంతో దెబ్బతిన్న పాలస్తీనాలో భూభాగమైన గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవాలని భావిస్తుంది పేర్కొన్నాడు.
Female Hostages Released: గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్‌తో హమాస్ కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, శనివారం నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు విడుదల అయ్యారు. కరీనా అరివ్, డానియెలా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్ మహిళా సైనికులు విడుదల చేసారు. వీరిని మొదట గాజాలోని రెడ్ క్రాస్ కు అప్పగించారు. ఈ విడుదల కార్యక్రమం సందర్భంగా, మహిళా సైనికులను ప్రత్యేక వాహనాలలో వేదికపైకి తీసుకువచ్చారు. అక్కడ వారి కుటుంబ సభ్యులతో క్షేమంగా…