ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాకు వెళ్లారు. ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశాల్లో శుక్రవారం ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి అమెరికాకు చేరుకున్నట్లు నివేదికలు అందుతున్నాయి.
అక్టోబర్ 7, 2023. ఇది ఎవ్వరూ మరిచిపోలేని తేది. ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన రోజు. హమాస్ ఉగ్రవాదులు మెరుపు వేగంతో ఇజ్రాయెల్‌పై దాడి చేసి కొందరిని చంపి.. ఇంకొందరిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఈ సంఘటన యావత్తు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసింది.
గాజాను స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గాజాను స్వాధీనం చేసుకోమని.. హమాస్ అంతమే లక్ష్యమని నెతన్యాహు చెప్పుకొచ్చారు.
ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసే సత్తా ఇజ్రాయెల్‌కు ఉందని ప్రధాని బెంజెమిన్ నెతన్యాహు తెలిపారు. ఇరాన్ అణు స్థావరాలు ధ్వంసం చేసేందుకు అమెరికా రంగంలోకి దిగబోతుందంటూ వార్తలు వచ్చాయి.
గాజా-ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధం రాజుకుంది. కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకరించకపోవడంతో ఇజ్రాయెల్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించింది. ఏడాదికిపైగా జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటికే గాజా సర్వనాశనం అయింది. తాజాగా జరిపిన దాడుల్లో అయితే భారీ స్థాయిలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తులు ధ్వంసం అయ్యాయి.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తొలిసారి కోర్టు బోనెక్కారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి ఇజ్రాయెల్ ప్రధానిగా నిలిచారు. అవినీతి విచారణ కేసులో భాగంగా న్యాయస్థానం మెట్లెక్కారు.
Benjamin Netanyahu: ‘‘ఆడు మగడ్రా బుజ్జీ’’ తెలుగు సినిమాలోని ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఇప్పుడు ఆ డైలాగ్ ఫర్‌ఫెక్ట్‌గా సూటయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? అంటే అది ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ అని చెప్పవచ్చు.
గాజా భవిష్యత్తుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను ఆక్రమించడం మా టార్గెట్ కాదు.. అక్కడ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితిని సృష్టిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
హమాస్‌లోని ఉగ్రవాద శక్తులను నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారీ ప్రాణనష్టం జరుగుతోంది.