ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గ్యాలెంట్‌లకు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. యుద్ధ నేరాలకు పాల్పడ్డ నెతన్యాహు, గ్యాలెంట్‌లకు అరెస్ట్ వారెంట్ కాదని.. వారిద్దరికి మరణశిక్ష విధించాలని ఖమేనీ డిమాండ్ చేశారు. ఇటీవల నెతన్యాహు, గ్యాలెంట్లకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఈ అరెస్ట్ వారెంట్‌పై సోమవారం ఖమేనీ స్పందిస్తూ మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Kaleshwaram Commission : ఏఈఈ-డీఈఈ ఇంజనీర్లపై కాళేశ్వరం కమిషన్ చీఫ్ అసహనం
సోమవారం బసిజ్ పారామిలటరీ ఫోర్స్‌ను ఉద్దేశించి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రసంగించారు. మన శత్రువు గాజా, లెబనాన్‌పై విజయం సాధించారన్నారు. అయినా ప్రజల ఇళ్లపై బాంబులు వేయడం విజయం కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని మూర్ఖులు ఆలోచించరన్నారు. ఇజ్రాయెల్ చేసింది నేరం అన్నారు. అరెస్ట్ వారెంట్‌తో సరిపోదని.. వారిద్దరికి మరణశిక్ష విధించాలని ఖమేనీ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Allu Arjun : పుష్ప – 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్ వచ్చేసింది.. ఎక్కడంటే..?
గాజాలో యుద్ధ నేరాలకు సంబంధించి ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నెతన్యాహు, గ్యాలెంట్‌లు గాజాలో హత్యలు, హింసకు, ఆకలి చావులకు కారణమయ్యారంటూ ఐసీసీ ఆరోపించింది. ఇదిలా ఉంటే తాము ఐసీసీ వారెంట్‌ను తిరస్కరిస్తున్నామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఆ న్యాయస్థానానికి వారెంట్ జారీ చేసే హక్కులేదని పేర్కొంది. తాము గాజాలో ఎటువంటి యుద్ధనేరాలకు పాల్పడలేదని తెలిపింది. మరోవైపు హమాస్ నేత ఇబ్రహీమ్ అల్ మస్రి అలియాస్ డెయిఫ్‌పై అక్టోబర్ 7, 2023 నాటి మారణకాండకు బాధ్యుడని ఐసీసీ ప్రకటించింది. అతడిపై కూడా వారెంట్ జారీ చేసింది. అతడిని ఇజ్రాయెల్ జులైలో హతమార్చింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : 100 కోట్లు స్వీకరించబోం.. అదానీ గ్రూప్‌కి నిన్ననే లేఖ రాశాం