ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసే సత్తా ఇజ్రాయెల్‌కు ఉందని ప్రధాని బెంజెమిన్ నెతన్యాహు తెలిపారు. ఇరాన్ అణు స్థావరాలు ధ్వంసం చేసేందుకు అమెరికా రంగంలోకి దిగబోతుందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ నిర్ణయాన్ని ట్రంప్ రెండు వారాలు వాయిదా వేశారు. రష్యా హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు.
ఇది కూడా చదవండి: Star Hospitals : గుండెకు మరొకసారి ధైర్యం – హార్ట్ ఫెయిల్యూర్‌పై నిపుణుల నివేదిక
న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేమని నెతన్యాహు తేల్చి చెప్పారు. ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసే సత్తా తమకు ఉందని స్పష్టం చేశారు. ఫోర్డ్‌లోని భూగర్భ అణు కేంద్రంతో సహా ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేవరకు వేచి చూడబోమని స్పష్టంచేశారు. ఇప్పటివరకు జరిపిన దాడులు కూడా అమెరికా ఆదేశాలతో చేయలేదని పేర్కొన్నారు. అయతుల్లా అలీ ఖమేనీ కారణంగా 3,500 సంవత్సరాల యూదు చరిత్ర అంతం కావడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఇరాన్‌ను ఢీకొట్టే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు ఉందని పేర్కొన్నారు. కీలకమైన లక్ష్యాలను ఛేదించగల సత్తా ఐడీఎఫ్‌కు ఉందని నెతన్యాహు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Iran-Israel : ఇరాన్-ఇజ్రాయెట్ యుద్ధంలో అమెరికా పాత్రేంటి? ఇరాన్ లో దాడికి ట్రంప్ ప్లాన్ చేస్తున్నారా?
ఇక ఇరాన్‌లో ఖమేనీ పరిపాలనను పతనం చేసే ఉద్దేశం తమకు లేదని, అది పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయమని తేల్చి చెప్పారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి దిగుతుందో.. లేదో పూర్తిగా ట్రంప్ నిర్ణయంగా చెప్పుకొచ్చారు. ఇక ఇజ్రాయెల్‌కు ఏది మంచిదో అదే చేస్తుందని.. అలాగే ట్రంప్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటారని భావిస్తున్నట్లు నెతన్యాహు చెప్పుకొచ్చారు.
ఇక తాజాగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఐడీఎఫ్ అడ్డుకుందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక తాజాగా ఇరాన్ క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. ఈ క్లస్టర్ బాంబుకు చిన్న బాంబులు ఉన్నాయి. ఇవి ఒకేసారి అనేక ప్రాంతాలను ధ్వంసం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌లో అనేక ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి.