గాజా భవిష్యత్తుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను ఆక్రమించడం మా టార్గెట్ కాదు.. అక్కడ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితిని సృష్టిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. హమాస్‌ను అంతం చేస్తేనే ఆ పరిస్థితులు వస్తాయన్నారు. అయితే మిలిటెంట్ బెదిరింపుల ఆవిర్భావాన్ని నిరోధించడానికి అవసరమైతే పాలస్తీనా భూభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నామని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.
Read Also: Seediri Appalaraju: కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని చూస్తున్నారు.. మంత్రి అప్పలరాజు ఫైర్
బెంజమిన్ నెతన్యాహు ఫాక్స్ న్యూస్‌లో మాట్లాడుతూ.. మేము గాజాను ఆక్రమించుటకు ప్రయత్నించము అన్నారు. భూభాగంలో పౌర ప్రభుత్వం రూపుదిద్దుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే అక్టోబర్ 7 నాటి హమాస్ దాడులు మళ్లీ జరగకుండా ఇజ్రాయెల్ చూసుకుంటుందని నెతన్యాహు చెప్పుకొచ్చారు. అవసరమైతే, గాజాలోకి ప్రవేశించి, హంతకులను చంపే శక్తి మాకు ఉంది.. హమాస్ లాంటి సంస్థ మళ్లీ ఆవిర్భవించకుండా నిరోధిస్తామన్నారు. హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసిన యుద్ధంలో గాయపడిన వారు లేదా వలసలు వెళ్లిన వేలాది మంది ప్రజలకు తాము అండగా ఉంటామని నెతన్యాహు తెలిపారు.
Read Also: SA vs AFG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్.. మరోసారి చెమటలు పట్టించేనా?
అయితే, ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అష్రఫ్ అల్-కిద్రా అల్ జజీరా టెలివిజన్‌తో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ గాజా సిటీ మెడికల్ కాంప్లెక్స్ ప్రాంగణాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం వల్ల చాలా ప్రాణనష్టం జరిగింది అని ఆయన ఆరోపించారు. ఈ దాడుల్లో ఆరుగురు మరణించారని ఆసుపత్రి డైరెక్టర్ అబు సాల్మియా అల్ జజీరా చెప్పారు. ఇక, పాలస్తీనా మీడియా అల్ షిఫా యొక్క వీడియో ఫుటేజీని ప్రసారం చేసింది. అల్-రాంటిసి పీడియాట్రిక్ హాస్పిటల్, అల్-నార్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లపై బాంబు పేలుళ్ల చేశారని పేర్కొన్నారు.