హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాల నుండి కొత్త సవాళ్లు ఉత్పన్నమవుతున్నాయన్నారు. గ్లోబల్ సౌత్‌లోని దేశాలు పెద్ద ప్రపంచ శ్రేయస్సు కోసం ఒకే గొంతుతో మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో గాజాలోని పెద్ద పెద్ద భవనాలు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. దీంతో ఈ యుద్ధంలో మరణించిన వారి గురించి వారి బంధవులు ఇప్పుడు శిథిలాల కింద గాలిస్తున్నారు.
Israel: గాజాలోని ఆస్పత్రులను హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్లుగా, షెల్టర్లుగా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయిల్ ఇటీవల ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించిన నిజాలను ప్రపంచం ముందుంచింది. ముఖ్యంగా గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి హమాస్‌కి ప్రధాన కేంద్రంగా ఉందని, ఈ ఆస్పత్రి కింద హమాస్ నెట్వర్క్ ఉందని ఇజ్రాయిల్ ఆర్మీ గుర్తించింది. ఈ ఆస్పత్రిని ఇప్పటికే ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మరింత తీవ్రం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజా స్ట్రిప్‌పై భూతల దాడి చేస్తున్న ఇజ్రాయిల్ బలగాలు హమాస్ వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు గాజాను అదుపులోకి తీసుకునేందుకు ఆపరేషన్స్ చేపడుతోంది. ముఖ్యంగా గాజాలోని ఉత్తర ప్రాంతంపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే హమాస్ పార్లమెంట్‌తో పాటు హమాస్ నియంత్రణలో ఉన్న ఓడరేవును ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకుంది.
Osama bin Laden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ రాసిన లేఖ వైరల్ అవుతోంది. అమెరికాలో 2001లో 9/11 దాడులకు బిన్ లాడెన్ పాల్పడ్డాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై విమానాలతో దాడి చేసిన ఉగ్రఘటనలో మాస్టర్ మైండ్ ఒసామా బిన్ లాడెన్‌దే. ఆ సమయంలో అమెరికన్లను ఉద్దేశించి రాసిని లేఖ ఇప్పుడు ఆ దేశంలో టిక్ టాక్‌లో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన 21…
Germany: ఇటీవల కాలంలో యూరప్ లోని పలు దేశాల్లో ఇస్లామిక్ తీవ్రవాదం చాపకింద నీరులా పెరుగుతోంది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో పలు దేశాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యం యూదులకు వ్యతిరేకంగా, పాలస్తీనా, హమాస్‌కి మద్దతుగా భారీ ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ఇవి ఆయా దేశాల్లో హింసకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, యూకేల్లో ఇలాంటి ప్రో పాలస్తీనా నిరసనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
Hamas: గాజాలో హమాస్ బందీలపై థాయ్‌లాండ్ రాజకీయ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యవర్తుల సంధి కుదిరితే, విడుదలయ్యే బందీల్లో థాయ్ దేశానికి చెందిన వారంతా ఉంటారని, ఇలా పాలస్తీనా మిలిటెంట్ సంస్థ తమకు హమీ ఇచ్చిందని థాయ్-ముస్లిం రాజకీయ నేతలు గురువారం తెలిపారు. ఏదైనా కాల్పుల విరమణ జరిగితే 3-5 రోజుల్లో బందీలను విడుదల చేస్తుందని, అందులో థాయ్ ప్రజలు ఉంటారని థాయ్-ఇరాన్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు లెపాంగ్ సయ్యద్ బ్యాంకాక్ పార్లమెంట్ భవనంలో…
Israel-Hamas War: గాజాలో హమాస్ ఉగ్రసంస్థను తుడిచిపెట్టేలా ఇజ్రాయిల్ దాడులు నిర్వహిస్తోంది. భూతలదాడుల్లో హమాస్ ఉగ్రవాదలను హతమారుస్తోంది. హమాస్ ఉగ్రసంస్థకు కేంద్రాలుగా ఆస్పత్రులను ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. ఈ ఆస్పత్రి కిందనే హమాస్ కమాండ్ సెంటర్ తో పాటు కీలక ఉగ్రవాదులు ఉన్నట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది.
Israel Hamas War: కష్టాలు వచ్చినప్పుడు ఎంత కష్టపడినా కష్టాలు దొరుకుతాయన్నారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 11 వేల మందికి పైగా మరణించారు. రకరకాల కథనాలు జనం ముందుకు వస్తున్నాయి.
Israel Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కారణంగా గాజాలో విధ్వంసం నెలకొంది. ఇజ్రాయిల్ నిరంతర దాడుల కారణంగా గాజా శ్మశాన వాటికగా మారుతోంది. అనేక నగరాల పేర్లు, జాడలు చెరిగిపోయాయి.