Hamas: హమాస్ బందీలను విడుదల చేస్తుంది.. థాయ్ రాజకీయ నేత కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hamas: గాజాలో హమాస్ బందీలపై థాయ్‌లాండ్ రాజకీయ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యవర్తుల సంధి కుదిరితే, విడుదలయ్యే బందీల్లో థాయ్ దేశానికి చెందిన వారంతా ఉంటారని, ఇలా పాలస్తీనా మిలిటెంట్ సంస్థ తమకు హమీ ఇచ్చిందని థాయ్-ముస్లిం రాజకీయ నేతలు గురువారం తెలిపారు. ఏదైనా కాల్పుల విరమణ జరిగితే 3-5 రోజుల్లో బందీలను విడుదల చేస్తుందని, అందులో థాయ్ ప్రజలు ఉంటారని థాయ్-ఇరాన్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు లెపాంగ్ సయ్యద్ బ్యాంకాక్ పార్లమెంట్ భవనంలో మీడియాతో వెల్లడించారు.
అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి ఊచకోతకు పాల్పడ్డారు. 1400 మందిని చంపేశారు. చిన్న పిల్లలు, మహిళలు అని చూడకుండా.. అత్యాచారాలు చేయడంతో పాటు తలలు నరికేశారు. ఇదే కాకుండా 240 మందిని బందీలుగా పట్టుకున్నారు. కిడ్నాప్‌కి గురైన వారిలో 25 మంది థాయ్‌లాండ్‌కి చెందిన వారు ఉన్నారు. దాడుల సమయంలో 39 మంది మరణించినట్లు ఆ దేశ విదేశాంగా శాఖ వెల్లడించింది.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
Read Also: sunitha krishnan: టెలిగ్రామ్, పేటీఎం, ఫోన్‌పే యాప్‌లపై చర్యలు తీసుకోవాలి.. సునీతాకృష్ణన్
అక్టోబర్ నుంచి హమాస్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పీకర్ వాన్ మహ్మద్ నూర్ మాతా నేతృత్వంలోని థాయ్-ముస్లిం రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిని కమిటీలో లెపాంగ్ సభ్యుడిగా ఉన్నారు. ఖతార్ మధ్యవర్తులు మూడు రోజుల సంధితో కూడిన ఒప్పందాన్ని కోరుతున్నారు. హమాస్ ఇప్పటి వరకు 50 మంది బందీలను విడుదల చేసింది. ఇజ్రాయిల్ తన వైపు ఉన్న ఖైదీల్లో మహిళలు, మైనర్లను విడుదల చేసింది.
థాయ్ ప్రభుత్వ అంచనాల ప్రకారం 30,000 మంది థాయ్ ప్రజలు ఇజ్రాయిల్ లో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 7200 మంది సొంతదేశానికి వెళ్లారు. థాయ్‌లాండ్ 70 మిలియన్ల జనాభాలో 90 శాతం బౌద్ధులు ఉంటే.. మిగిలిన వారు ముస్లింలు ఉన్నారు.
తాజావార్తలు
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!